ప్రకృతి సహజంగా లభించే ఫ్రూట్స్ లో ఒకటైన కమలాపండులో శరీరానికి కావడంలో ఎన్నో పోషకాలు నిల్వవుంటాడు. అవి.. రకరకాల వ్యాధుల నుంచి పోరాడి, నిత్యం ఆరోగ్యంగా మెలిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ కమలాపండును రెగ్యులర్ గా తీసుకుంటే.. క్యాన్సర్ వంటి హానికరమైన వ్యాధినే అడ్డుకట్ట వేయవచ్చునని చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ పండ్లలో సిట్రస్ పాళ్లు ఎక్కువ మోతాదులో వుంటుంది. వీటిని తినడం వల్ల చర్మం, ఊపిరితిత్తులు, కడుపు, పేగుల్లో క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే కమలాపండ్లను రసంతీసి తాగడం వల్ల కిడ్నీ జబ్బులు కూడా రావు. కిడ్నీల్లో రాళ్లు చేరే అవకాశం ఉంటే కమలాపండ్లు దాన్ని నిరోధిస్తాయి.
అంతేకాదు.. ఈ పండు కాలేయ క్యాన్సర్‌ను అరికడుతుంది. ఇంకా శరీరంలో కొవ్వు పేరుకోవడాన్ని ఇది అరికడుతుంది. కొలెస్టరాల్ పెరుగుదలను నిరోధించడంలో కమలాలు చాలా శక్తిమంతంగా పనిచేస్తాయి. కమలాపండ్లలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరిచి, ఆకలిని పుట్టిస్తుంది. హృదయస్పందనలకు అవసరమైన పొటాషియం, మెగ్నీషియం కమలాపండ్లలో పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లు రక్తపోటును అదుపులోవుంచి, పల్స్ రేటులో హెచ్చుతగ్గులు రాకుండా చూస్తాయి. ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్ సి వల్ల చర్మానికి కావలసిన జీవశక్తి లభిస్తుంది. చర్మకణాలు పాడవకుండా సి విటమిన్ కాపాడుతుందని వైద్యులు చెబుతారు. అలాగే వైరల్ ఇన్‌ఫెక్షన్ రాకుండా కమలాలు కాపాడుతాయి. శరీరంలోని మలినాలను శుద్ధిచేసి మనల్ని ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచే కమలాపండ్లను చక్కగా రోజూ తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. కమలాపండ్లు తినండి.. ఆరోగ్యంగా వుండండని అంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more