Tirupati laddu problem on devotees

tirupati laddu problem on devotees, tirupati laddu, prasadam, tirumala temple in tirupati, shree vaari prasadam , lord venkateswara

tirupati laddu problem on devotees

అంగడి సరుకులా మారిపోతోంది

Posted: 05/01/2013 06:17 PM IST
Tirupati laddu problem on devotees

 

శ్రీవారి లడ్డూ మాధుర్యానికే కాదు, పవిత్రతకూ చిహ్నం. రెండు లడ్డూలు తీసుకువెళ్లి ఇంటిల్లిపాదీ పవిత్రంగా ఆరగించే ఈ ప్రసాదం క్రమేపీ అంగడి సరుకులా మారిపోతోంది. తిరుమలలో మాత్రమే విక్రయించాల్సిన లడ్డూలను ఊరూరా తరలించి విక్రయిస్తుండడం వల్ల వాటి పవిత్రతకు భంగం కలుగుతోంది. ఆలయ వ్యవహారాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం, వ్యక్తిగత ప్రాపకం కోసం ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తున్నాయి. శ్రీవారి భక్తులు ఎంతటివారైనా భక్తిభావంతో, పవిత్రంగా భావించే లడ్డూలను టీటీడీయే స్వయంగా బజారులో తీపి పదార్థంలా ఎక్కడపడితే అక్కడ విక్రయిస్తోంది. భక్తుల సౌకర్యార్థం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన టీటీడీ సమాచార కేంద్రాలు లడ్డూ విక్రయ కేంద్రాలుగా అవతారమెత్తుతున్నాయి. పోనీ... లడ్డూల తయారీని ఇతోధికంగా పెంచి ముందుగా తిరుమలలో కోరినన్ని ఇస్తూ, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారా? అంటే అదీ లేదు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమల చేరుకునే భక్తులకు ఇప్పటికీ కోటా పద్ధతిలోనే లడ్డూ ప్రసాదాలు అందిస్తున్నారు.

తిరుమల ఆలయంలో సగటున రోజుకు మూడు లక్షల లడ్డూలు తయారుచేస్తున్నారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఒక్కొక్కరికి రెండు లడ్డూలు ఇస్తున్నారు. అదనంగా బహిరంగ విక్రయాల పేరిట మనిషికి నాలుగు లడ్డూల చొప్పున అందచేసేందుకు ప్రత్యేక లడ్డూపడి టిక్కెట్ల విక్రయశాలను ఏర్పాటుచేశారు. లడ్డూ విక్రయాలను తిరుమలకే పరిమితం చేయవలసిన ఆవశ్యకత ఎంతైన ఉంది. భౌగోళిక గుర్తింపు పొందిన పరమపవిత్ర ప్రసాదాన్ని తిరుమలలోనే కోరిన పరిమాణంలో లభించేలా చర్యలు తీసుకుంటే భక్తులలో లడ్డూ ప్రసాదంపై మరింత భక్తిభావం పెరుగుతుందనేది నిర్వివాదాంశం

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles