Heavy snowfall in vishaka agency

Heavy snowfall in vishaka agency

Heavy snowfall in vishaka agency

Heavy snowfall.png

Posted: 12/21/2012 05:36 PM IST
Heavy snowfall in vishaka agency

ఆమధ్య కాస్త మొహం చాటేసిన చలి ఇప్పుడు మళ్లీ మన్యాన్ని వెంటాడుతోంది. మంచును వెంటేసుకు వచ్చి జనాన్ని గజగజ వణికిస్తోంది. చలితీవ్రత నానాటికీ పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నా యి. గురువారం లంబసింగిలో 3 డిగ్రీలు, చింతపల్లి, మినుములూరుల్లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. మంచు దట్టంగా కురుస్తూ ఉండడంతో పాటు చలి గాలులు వీస్తున్నాయి. మినుములూరులో బుధవా రం 9 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత ఒక్క రోజు వ్యవధిలోనే రెండు డిగ్రీలు తగ్గింది.చింతపల్లి కన్నా లంబసింగి శీతల ప్రాంతం కావడంతో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యని, రానున్న రోజుల్లో మరింత తగ్గిపోయే అవకాశం ఉందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి. శేఖర్ తెలిపారు. గత నెల 15న చింతపల్లిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, లంబసింగిలో 2 డిగ్రీలు నమోదయింది.

అప్పటి నుంచి నెల రోజుల పాటు తగ్గిన చలి మంగళవారం నుంచి మళ్ళీ తీవ్రరూపం దాల్చింది. మంగళవారం చింతపల్లిలో 8 డిగ్రీలు నమోదుకాగా, లంబసింగిలో 4 డిగ్రీలు నమోదయింది. గురువారం ఉష్ణోగ్రతలు మరింత దిగజారాయి. పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగి పుట్టు, అరకులోయ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. మంచు వర్షం లా కురుస్తోంది. ఉదయం 10 గంటల వరకు వణికిస్తున్న చలితో జనజీవనం స్తంభిస్తోంది. పాఠశాలలకు వెళ్లే చిన్నారు లు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన తండాల్లో జనం చలి మంటలతో ఉపశమనం పొందు తున్నారు. సాయం త్రం నాలుగు గంట లకే సూర్యుడు మబ్బుల చాటుకు జారు కుంటున్నాడు. చలిగాలులు వీస్తున్నాయి. దాంతో జనం రోడ్ల మీదకు రాలేని దుస్థితి. రాబోయే రోజుల్లో చలి తీవ్రతపై మన్యవాసులు మరింత బెంబేలెత్తు తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajiv trivedi ips to swim 25 kms in visakha beach
All party bandh in visakha agency areas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more