Minister purandeswari vs hindustan zinc ltd in visakhapatnam

central minister d purandeswari, daggupati purandeswari, suspends production, visakhapatnam zinc smelter, production capacit, hindustan zinc limited, hzl, zinc smelter post, gajuwaka, visakhapatnam, company closed, hzl employees, mla malla vijaprasad,

minister purandeswari vs hindustan zinc ltd in visakhapatnam

minister-purandeswari.gif

Posted: 04/04/2013 03:03 PM IST
Minister purandeswari vs hindustan zinc ltd in visakhapatnam

minister purandeswari vs hindustan zinc ltd in visakhapatnam

కేంద్రమంత్రి  పురందేశ్వరికి  హిందుస్థాన్ జింక్  పరిశ్రమ యాజమాన్యం షాకిచ్చింది.  త్వరలో జింక్ పరిశ్రమను మూసివేసే పనిలో  యాజమాన్యం ఉందని  కార్మికులు అంటున్నారు.   ఈ విషయంలో   పురందేశ్వరికి  జింక్ పరిశ్రమ యాజమాన్యం మధ్య జరిగే చర్చలు విఫలమయ్యనట్లు తెలుస్తోంది.  అంతేకాకుండా  పురందేశ్వరిని  కంపెనీలోకి రాకుండా గేట్లు మూసివేసినట్లు సమాచారం.  హిందుస్థాన్ జింక్ కర్మాగారం యాజమాన్యం కార్మికులను లోపలకు రానివ్వకుండా ప్రధాన ద్వారాన్ని మూసివేసేందుకు యత్నించింది. వెంటనే కార్మికులు ఆందోళనకు దిగడంతో వెనక్కి తగ్గింది. తిరిగి గేట్లను తెరిచింది. అయితే అర్ధరాత్రి నుంచి గేట్లు మూసేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్టు కార్మిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టేందుకు కార్మిక కుటుంబాలు సన్నద్ధమవుతున్నాయి. కార్మికులు విధులకు హాజరయ్యేందుకు లోపలకు వెళుతుండగా రావద్దంటూ యాజమాన్య ప్రతినిధులు గేట్లను మూసేశారు. ఏడాదిగా పరిశ్రమలో ఉత్పత్తిని నిలిపివేసిన యాజమాన్యం నాలుగైదు నెలలుగా కార్మికులకు జీతాలు కూడా ఇవ్వడం లేదు.

minister purandeswari vs hindustan zinc ltd in visakhapatnam

అయినప్పటికీ కార్మికులు విధులకు హాజరవుతున్నారు. కార్మికులకు యాజమాన్యం మంచినీరు, రవాణా, క్యాంటీన్ తదితర సదుపాయాలను నిలిపివేసింది. జింక్ పరిశ్రమను తెరిపించేందుకు యాజమాన్యంతో గత నెల 20న ఢిల్లీలో కేంద్ర గనుల శాఖా మంత్రి సమక్షంలో కేంద్ర మంత్రి పురందేశ్వరి, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, జిల్లా కార్మిక శాఖ అధికారులు చర్చలు జరిపారు. కానీ ఈ చర్చలకు విఘాతం కలిగిస్తూ జింక్ యాజమాన్యం ఏకంగా గేట్లు మూసివేసేందుకు యత్నించింది. ఈ విషయాన్ని పురందేశ్వరి, ఎమ్మెల్యే మళ్లలు గనుల మంత్రికి తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ganta srinivasa rao library land in visakhapatnam
Tdp mla kalidindi suryana naga sanyasi raju  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more