తరతరాలనుంచి బానిసత్వంలో మగ్గుతూవచ్చిన వెనుకబడిన ప్రజలను విముక్తి కలిగించడం కోసం ఎందరో మహానుభావులు, మహిళాప్రతిభావంతులు ముందుకు వచ్చారు. సమాజంలో పేద-ధనిక, కుల-మతం, లింగ-భేదాలు వుండకూడదన్న నినాదంతో ఉద్యమాలు నిర్వహించి సామాన్య ప్రజల్లో చైతన్యం కల్పించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, సమస్యలను అరికట్టడంలో తమవంతు కృషి చేశారు. అటువంటివారిలో జెట్టి ఈశ్వరీబాయి ఒకరు. పూర్వపు హైదరాబాద్ సంస్థానంలోని సామాజిక సేవారంగంలో ఈమె గణనీయమైన సేవలు అందించారు. ముఖ్యంగా నగరంలో ఘోషా పద్ధతి పాటించే సాంప్రదాయం కొట్టిమిట్టాడుతున్న సమయంలోనే ఆమె సాంఘిక రంగంలో పనిచేశారు.
జీవిత విశేషాలు :
1918 డిసెంబరు 1 వ తేదీన సికింద్రాబాదులోని చిలకలగూడలో ఒక సామాన్య దళిత కుటుంబానికి చెందిన బల్లెపు బలరామస్వామి - రాములమ్మ దంపతులకు ఈశ్వరీబాయి జన్మించారు. ఆ దంపతులకు మొత్తం ఆరుగురు సంతానం. నిజాం స్టేట్స్ రైల్వేస్’లో పనిచేసిన బలరామస్వామి.. కొద్ది సంపాదనతోనే తన పిల్లలందరికీ చదువులు చెప్పించారు. ఇక ఎస్.పి.జి. మిషన్ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించిన ఈశ్వరీబాయి.. కీస్ హైస్కూలులో ఉన్నతవిద్య చదువుకున్నారు. 13వ ఏటలోనే ఆమె వివాహం పూణేలోని దంత వైద్యుడు జెట్టి లక్ష్మీనారాయణతో జరిగింది. కూతురు పుట్టిన అనంతరం భర్త చనిపోగా.. ఆమె కూతురితో హైదరాబాద్ తిరిగొచ్చేసింది.
అలా వచ్చిన ఆమె పరోపకారిణి అనే ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా వృత్తి జీవితం ప్రారంభించింది. ఆ పాఠశాలలో పనిచేస్తూనే కొందరు సంపన్న కుటుంబాల పిల్లలకు బోధనా తరగతులను నిర్వహించేవారు. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీషు తదితర భాషలలో మంచి పరిజ్ఞానం వున్న ఈమె.. తన బహుభాషా ప్రత్యేకతతో అందరికీ ఆత్మీయులయ్యారు. ఓ వైపు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తూనే ఇంకోవైపు సాంఘిక సేవలో పాల్గొనేది. తన దగ్గరున్న డబ్బుతోనే ఆమె గీతా ప్రైమరీ స్కూలు, గీతా మిడిల్ స్కూలు అనే విద్యాసంస్థలను మొదలుపెట్టింది.
రాజకీయ జీవితం :
1951లో హైదరాబాదు-సికింద్రాబాదు నగర పురపాలక సంఘానికి ప్రజాస్వామ్య రీతిలో తొలిసారిగా ఎన్నికలు జరిగిన సమయంలో ఆమె చిలకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి గెలుపొందారు. ఆ సమయంలో ఆమెకు దళిత వర్గాల నివాస వీధులలో అధిక ఓట్లు లభించాయి. అలా కౌన్సిలర్’గా ఎన్నికైన ఆమె మురికివాడల్లో మంచినీటి సౌకర్యం, వీధి దీపాల ఏర్పాట్లు, మరుగుదొడ్ల నిర్మాణం, కార్మికులకు ఇళ్లస్థలాలు ఇప్పించడం వంటివి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. కౌన్సిలర్‌గా నగరాభివృద్ధికి అహర్నిశలు శ్రమించారు. పురపాలక సంఘ కౌన్సిలరుగా రెండు పర్యాయాలు పనిచేసింది.
1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా రాష్ట్ర శాసనసభకు పోటీచేశారు కానీ అందులో ఆమె ఓడిపోయింది. కానీ 1967లో జరిగిన ఎన్నికల్లో అదేస్థానం నుంచి ఆమె పోటీచేసి గెలుపొందారు. అనంతరం 1969లో మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలిదశల్లో ఆమె తనవంతు సేవలందించి ప్రశంసలు అందుకుంది. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ పోరాట సమితి (ఎస్‌టిపిఎస్) అనే పార్టీని స్థాపించింది. 1972లో తిరిగి ఎల్లారెడ్డి నియోజకవర్గం ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి రెండోసారి గెలుపొందింది. ఆవిధంగా పదేళ్లపాటు శాసనసభలో ముఖ్యమైన పాత్ర వహించిన ఈమె.. 1978లో మూడోసారి ఓడిపోయింది.
మహిళా సంక్షేమం కోసం :
కొంతకాలం మహిళా, శిశు సంక్షేమ బోర్డుకు అధ్యక్షురాలిగా వున్న ఈశ్వరీబాయి.. మహిళాభ్యుదయానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు జరిపారు. 952 నుండి 1990 వరకు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాసేవా రంగంలో పనిచేస్తూ దళిత ప్రజలు, వెనుకపడిన, బలహీన, బడుగువర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఇలా ఈవిధంగా సమాజంలో తనవంతు సేవలు అందించిన ఈమె.. అవసాన దశలో క్యాన్సర్ వ్యాధికి గురై 1991 ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more