no need of suspension motion against dk aruna: deputy speaker

Deputy speaker calms suspension motion against dk aruna

telangana assembly, Deputy speaker padma devender Reddy, harish rao, janareddy, dk aruna, speaker madhusudhana chary, cm kcr, ktr, rasamayi balakishantelangana assembly, Deputy speaker padma devender Reddy, harish rao, janareddy, dk aruna, speaker madhusudhana chary, cm kcr, ktr, rasamayi balakishan

telangana assembly deputy speaker padma devender reddy requests minister harish rao, not to move suspension motion against congress mla dk aruna

కంటతడి పెట్టిన తెలంగాణ డిఫ్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి

Posted: 03/22/2016 05:47 PM IST
Deputy speaker calms suspension motion against dk aruna

తెలంగాణ శాసనసభలో ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ చర్చకు దారితీసిన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యురాలు ఏకంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యాలు సభలో కలకలం రేపాయి. వాటిని అమె తీవ్రంగా కలత చెందిన కంటతడిపెట్టారు. ఒకానోకదశలో సభ నుంచి కాంగ్రెస్ సభ్యురాలిని సస్పెండ్ చేసే వరకు స్థాయి వరకు వెళ్లినా.. మళ్లీ అదే డిఫ్యూటీ స్పీకర్ తన ఔదర్యాన్ని చూపుతు.. సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పడమే కాకుండా.. అమెపై సస్పెన్షన్ మోషన్ మూవ్ చేయాల్సిన అవసరం లేదని వద్దని మంత్రిని రిక్వెస్ట్ చేశారు.

సంస్కారం లేనివారు సభను నిర్వహిస్తున్నారంటూ మంగళవారం సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపం చెందిన పద్మా దేవేందర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు జోక్యం చేసుకుని 'మహిళ పట్లచ అందులోనూ డిఫ్యూటీ స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు తగవని అన్నారు. సభాపతిని డిక్టేట్ చేయడం సరికాదని,  డీకే అరుణ వెంటనే క్షమాపణ చెప్పాలని' డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సస్పెండ్ చేయడానికి వెనుకాడేది లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.

ఏపీ శాసనసభలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ మహిళ ఎమ్మెల్యేను ఏడాదిపాటు సభనుంచి సస్పెండ్ చేశారని, అయితే తాము అలాంటి చర్యకు పోదలచుకోలేదని అన్నారు. గతంలో తాము సభలో మాట జారితే తమ నాయకుడు...మంత్రులతో క్షమాపణ చెప్పించారని హరీశ్ రావు గుర్తు చేశారు. అది తమ సంస్కారమని, క్షమాపణ చెబితే కిరీటమేమీ పడిపోదని ఆయన అన్నారు.   మరోవైపు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తనపై చేసిన వ్యాఖ్యలకు సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ సభలో అందరూ హుందాగా వ్యవహరించాలని సూచించారు. సభాపతిపై ప్రతిపక్షానికి గౌరవముందని, సభ్యులు ఆవేశపడినా గతంలో తాము సర్ధుబాటు చేసిన ఘటనలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై వాదాపవాదాలు వద్దని అందరూ సమన్వయం పాటించాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై డీకే అరుణ మాట్లాడుతూ... తాను ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana assembly  Deputy speaker padma devender Reddy  harish rao  janareddy  dk aruna  

Other Articles