India finally has a gay marriage bureau

India finally has a gay marriage bureau

India, Gay marriage, gay marriage bureau, NRI

The Supreme Court's decision to criminalize homosexuality has not deferred India to have its first marriage bureau for homosexuals. An NRI has established India's first avenue where gays can find their soulmate. The bureau will help them find the right match, both within and outside the country.

హోమోసెక్సువల్స్ కోసం మ్యారేజ్ బ్యూరో

Posted: 03/22/2016 05:29 PM IST
India finally has a gay marriage bureau

దేశంలో ఎన్నో మ్యారేజ్ బ్యూరోలు మనకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని వర్గాల వారిగా, కులాల వారిగా, మరికొన్ని ఆదాయం ఆధారంగా పెళ్లిళ్లు చేస్తున్నాయి. అయితే తాజాగా ఉన్నట్టుండి ఓ మ్యారేజ్ బ్యూరో గురించి దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అంతలా ఏంటి ఆ మ్యారేజ్ బ్యూరో స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా..? ఆ మ్యారేజ్ బ్యూరోలో కేవలం హోమోసెక్సువల్స్ కు మాత్రమే పెళ్లిళ్లు చేస్తారు. ఇండియాన్ హోమోసెక్సువల్స్ కోసం అరేంజ్ గే మ్యారేజ్ డాట్ కామ్ పేరుతో మ్యారేజ్ బ్యూరో ప్రారంభం కానుంది. అమెరికాలో స్థిరపడిన ఎన్నారై బెనహర్ శామ్సన్.. స్వలింగ సంపర్కుల కోసం ఇండియాలో ఫస్ట్  మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు.

డేటింగ్ వెబ్ సైట్లతో పోలిస్తే తమ మ్యారేజ్ బ్యూరో విభిన్నంగా ఉంటుందని తెలిపారు. తమ జీవిత భాగస్వాములను వెతుక్కునేందుకు హోమోసెక్సువల్స్ పెద్ద సంఖ్యలో ఇండియాకు వస్తున్నారని, ఇలాంటి వారి కోస‌మే ఇక్క‌డ అరేంజ్ గే మ్యారేజ్ డాట్ కామ్ పేరుతో మ్యారేజ్ బ్యూరో ప్రారంభిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. సంబంధాల కోసం ఇప్పటికే 250 మంది తమను సంప్రదించారని, వీరిలో ఎక్కువ మంది భారతీయులున్నారని తెలిపారు. ఇక్క‌డి డిమాండ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నానని బెనహర్  చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Gay marriage  gay marriage bureau  NRI  

Other Articles