CAG finds 96 per cent of Rs.7 lakh crore of tax arrears ‘difficult to recover’

Uncollected tax demand increased to rs 7 lakh cr in fy15

Income Tax,Parliament,CAG,CBDT,uncollected tax , Uncollected tax demand increased to Rs 7 lakh cr in FY15,news, India news,Economy Policy News,Economy & Policy News in India

The CAG said amount towards uncollected tax demand increased to Rs 7 lakh crore at March 2015 end from Rs 5.75 lakh crore in the previous year.

వసూలు కాని పన్ను.. పర్వతంలా పెరిగిపోయింది..

Posted: 03/12/2016 05:56 PM IST
Uncollected tax demand increased to rs 7 lakh cr in fy15

వసూలు కాని పన్ను మొత్తాలు 2015 మార్చి నాటికి రూ. 7 లక్షల కోట్లకు పెరిగాయి. 2014 ఇదే నెల నాటికి ఈ మొత్తం రూ.5.75 లక్షల కోట్లు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక ఈ విషయాన్ని తెలిపింది.  పన్ను బకాయిదారుల స్థిర, చర ఆస్తుల జప్తు, అమ్మకం, సంబంధింత ఆస్తుల నిర్వహణకు రిసీవర్ నియామకం, జైలుశిక్ష వంటి ఎన్నో మార్గాల ద్వారా చట్ట ప్రకారం వసూళ్లకు అవకాశం ఉన్నప్పటికీ ఈ పరిమాణం పెరుగుతున్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది.

స్వాధీనానికి తగిన ఆస్తులు లేకపోవడం, బకాయిదారుడు ఎక్కడ ఉన్నాడో గుర్తించలేకపోవడం, పలు కేసులు న్యాయ, అధికార పరిధుల్లో పెండింగులో ఉండడం వంటి అంశాలు పన్ను డిమాండ్‌లు నెరవేరకపోవడానికి కారణాలని తెలిపింది. 2013-14తో పోల్చితే 2014-15లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 9 శాతం మేర (రూ.57,196 కోట్లు) పెరిగినట్లు పేర్కొంది. అయితే స్థూలంగా పన్ను వసూళ్లలో వీటి వాటా మాత్రం 56.1 శాతం నుంచి 55.9 శాతానికి తగ్గినట్లు వివరించింది

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Income Tax  Parliament  Tax receivables  CAG report  

Other Articles