Weak global cues, oil drag Sensex 253 pts ahead of FOMC

Sensex slips 253 points ahead of us fed meet nifty settles at 7460

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Fall in global peers and oil prices dragged Indian equity benchmarks 1 percent Tuesday ahead of Federal Reserve's two-day meeting that will begin tonight.

నష్టాల్లో మార్కెట్లు.. 7500 మార్కుకు దిగువన నిఫ్టీ

Posted: 03/15/2016 07:51 PM IST
Sensex slips 253 points ahead of us fed meet nifty settles at 7460

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిసాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాల కారణలతో పాటు అమెరికా సెంట్రల్ బ్యాంకు పెడ్ రిజర్వు త్వరలో ద్రవ్య పరపతి విధానంపై సమీక్షిస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలలో పయనించాయి. లాభాల స్వీకరణ అనంతరం ఇన్వెస్టర్లు తమ ఈక్విటీలను విక్రయించేందుకే మొగ్గు చూపడంతో భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపు కన్నా తక్కువగా ఆరంభమైన సూచికలు, ఆపై మరే దశలోనూ పుంజుకోలేకపోయాయి.

 గత కొన్ని సెషన్లుగా 7,500 పాయింట్ల వద్ద మద్దతు కూడగట్టుకోవడంలో ఇబ్బందులు పడుతున్న నిఫ్టీ, ఈక్విటీల విక్రయాలతో ఆ స్థాయి నుంచి జారిపోయింది. మంగళవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 253.11 పాయింట్లు పడిపోయి 1.02 శాతం నష్టంతో 24,551.17 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 78.15 పాయింట్లు పడిపోయి 0.38 శాతం లాభంతో 7,538.75 పాయింట్ల వద్దకు చేరాయి.

బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.79 శాతం, స్మాల్ క్యాప్ 0.91 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 36 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, కెయిర్న్ ఇండియా, టెక్ మహీంద్రా, వీఈడీఎల్ తదితర కంపెనీలు లాభపడగా, కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐడియా, సన్ ఫార్మా, టీసీఎస్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,801 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,011 కంపెనీలు లాభాల్లోను, 1,633 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. సోమవారం నాడు రూ. 92,04,276 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 91,28,465 కోట్లకు తగ్గింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles