Bears on the upper hands, Nifty Sink by 100 points

Sensex loses 371pts nifty ends at 7615

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Sensex fell 101 points and ended at 26966. The Nifty deep ended with down by 101 points at 7615 level.

నష్టాల్లో మార్కెట్లు.. సెన్సెక్స్ 371, నిఫ్టీ 101 పాయింట్ల లాస్

Posted: 03/28/2016 06:15 PM IST
Sensex loses 371pts nifty ends at 7615

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా వస్తున్నా నాలుగు రోజుల లాభాలకు ఇవాళ బ్రేకులు పడ్డాయి. ఉదయం ప్రారంభం నుంచే మార్కెట్లు తిరోగమనంలో పయనిస్తున్నాయి. మార్కెట్లు ముగిసేవరకు ఏక్కడినుంచైనా సానుకూల పవనాలు వస్తాయని ఆశించిన మదుపరుల ఆశలు అడియాశలయ్యాయి. ఇవాళ మార్కెట్లలో అనేక సంస్థల షేర్లు నష్టాలను ఎదుర్కోన్నాయి. ముఖ్యంగా కన్జూమర్ డ్యూరబుల్స్, బాకింగ్, మెటల్స్, క్యాపిటల్ గూడ్స్ సంస్థల షేర్లు అధికంగా రెండు నుంచి ఐదు శాతం వరకు నష్టపోయాయి.

ఈ నేపథ్యంలో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్ 25 వేల మార్కుకు దిగువన, నిఫ్టీ 7650 మార్కుకు దిగువన ముగిసాయి. సెన్సెక్ 371 పాయింట్లను నష్టపోయి 24 వేల 966 మార్కు వద్ద ట్రేడింగ్ ముగించగా, అటు నిఫ్టీ కూడా 101 పాయింట్లు కోల్పోయి 7 వేల 615 పాయింట్ల వద్ద ముగసింది. కాగా ఇవాళ్టీ ట్రేడింగ్ లో రమారమి అన్ని సూచీలు నష్టాల బాటలోనే పయనించగా, 740 సంస్థల షేర్లు లాభాలను నమోదు చేసుకోగా, 1942 సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇవాళ్లి ట్రేడింగ్ లో కన్జూమర్ డ్యూరబుల్స్, బ్యాంకెక్స్, హెల్త్ కేర్, మెటల్స్, బ్యాకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, మద్య తరహ, చిన్న తరహా పరిశ్రమల సూచీలు అత్యధిక నష్టాలను ఎదుర్కోన్నాయి. మిగిలిన సూచీలు కూడా నష్టాల బాటలోనే పయనించాయి. ఈ నేపథ్యంలో కోటక్ మహేంద్ర, ఎన్ టీ ఫీ సీ, పవర్ గ్రిడ్స్ కార్పోరేషన్, బాస్చ్, అంబుజా సిమెంట్స్ సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, వేదంతా, హిండాల్కో, టాటా స్టీల్, సన్ ఫార్మా, ఎస్ బి ఐ సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.    

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles