Mercedes-Benz C-Class 250d launched at Rs 44.36 lakh in India

Mercedes benz introduces c class 250 d sedan

Mercedes Benz india,Mercedes-Benz C-Class 250d,Mercedes-Benz C-Class 250d India launch,Mercedes-Benz C-Class 250d India price,Mercedes-Benz C-Class 250d specifications, Mercedes-Benz C-Class 250d features,Mercedes-Benz C-Class 250d images,Mercedes-Benz C-C

German luxury car maker Mercedes-Benz launched the new C-Class 250d variant in India, with a price tag of Rs 44.36 lakh (ex-showroom Pune).

భారత విఫణిలోకి మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ 250 డి..

Posted: 03/24/2016 05:13 PM IST
Mercedes benz introduces c class 250 d sedan

లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా మిడ్ సైజ్ లగ్జరీ సెగ్మంట్లో కొత్తదైన  సి క్లాస్ 250డి వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ధర రూ.44.36 లక్షలు(ఎక్స్ షోరూమ్, పుణే) అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, రోలాండ్ ఫోలర్ చెప్పారు. 2,142 సీసీ డీజిల్ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారులో 9జీ ట్రానిక్ ట్రాన్సిమిషన్, ఎల్‌ఈడీ ఇంటెలిజెంట్ లైట్ సిస్టమ్, జర్మిన్ మ్యాప్ పైలట్,17 అంగుళాల అలాయ్ వీల్స్,యాంబియంట్ లైటింగ్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. 0-100 కిమీ. వేగాన్ని 6.6 సెకన్లలో అందుకుంటుందని తెలిపారు.

గరిష్ట వేగం గంటకు 247 కిమీ. అని, సి క్లాస్ కారులో తొలిసారిగా 9జీ-ట్రానిక్ ట్రాన్సిమిషన్ ఫీచర్‌ను అందిస్తున్నామని తెలిపారు. 180 డిగ్రీ వ్యూ ఉన్న రివర్సింగ్ కెమెరా, అటెన్షన్ అసిస్ట్, పార్క్‌ట్రానిక్ ఫీచర్‌తో కూడిన యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్,  హిల్ స్టార్ట్ అసిస్ట్, తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. సి క్లాస్ బ్రాండ్ కింద సి 200,సి 220డి మోడళ్లను విక్రయిస్తున్నామని, తాజాగా 250 డిని అందుబాటులోకి తెస్తున్నామని రోలాండ్ పేర్కొన్నారు.

వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి, డిమాండ్‌ను అందుకోవడానికి వీలుగా దేశీయంగానే ఈ కారును తయారు చేయడం ప్రారంభించామని వివరించారు. భారత్‌లో అగ్రశ్రేణి లగ్జరీ కార్ల కంపెనీగా తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకోవడానికి ఈ ఏడాది 12 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేవాలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా యోచిస్తోంది. 2014లో 10,201గా ఈ కంపెనీ విక్రయాలు గత ఏడాది 32 శాతం వృద్ధితో 13,502కు పెరిగాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mercedes-Benz  Mercedes-Benz C-Class 250 D  Roland pholar  

Other Articles