వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ తయారీ సంస్థలు పోటీపడి మరీ ఓ వైపు అత్యంత ఖరీధుతో కూడా నాణ్యతయుతమైన ఫోన్లను రూపొందిస్తూనే.. మరోవైపు సామాన్య ప్రజలకు అందుబాటులో వుండేలా బడ్జెట్ ఫోన్లను కూడా రూపోందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. దేశీయ విఫణిలోకి ఒప్పో ఏ3ఎస్ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్‌లో ఒప్పో ఏ3ఎస్ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 10,990గా నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది.
సూపర్ ఫుల్ స్క్రీన్ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ 450, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 32జీబీ స్టోరేజ్, డ్యూయల్ రియర్ కెమెరా, సెల్ఫీ కెమెరా, 19:9 రేషియో, రెడ్, డార్క్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 8.1, 6.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 13 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండ్ సెన్సార్ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్, సెల్ఫీ, 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, మైక్రో-యూఎస్బీ, 3.5 హెడ్‌ఫోన్ జాక్, 4230ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ కు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏప్రిల్ నెలలో ఒప్పో ఏ3 స్మార్ట్ ఫోన్ ను చైనాలో విడుదల చేసినట్లు కంపెనీ స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్‌లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more