బంగారం మళ్లీ కాంతుల్ని కోల్పోతుంది. కుందనం ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ పసిడి ధర ఐదున్నర నెలల కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్ క్షీణించడం.. అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వు త్వరలో వడ్డీ రేట్లను పెంచుతుందన్న ప్రకటన కూడా అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర ఇవాళ బులియన్ మార్కెట్ తగ్గముఖం పట్టింది. పది గ్రాముల బంగారం ధర 250 రూపాయలు తగ్గి, రూ.30,800గా నమోదైంది.
ఇదిలా వుండగా మరో వారం రోజల్లో పసిడి ధరలు మరింత తగ్గనున్నట్లు ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధర మరింతగా తగ్గి.. 29వేల 500 రూపాయలకు చేరుకుంటుందని అంచానాలు వేస్తున్నారు. ఇక సామాన్యుల ఆభరణ లోహంగా పేరోందిన వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కేజీ వెండి ధర ఇవాళ భారీగా తగ్గింది. ఏకంగా కిలో వెండి 620 రూపాయలు తగ్గి 40వేలకు కింద రూ.39,200గా నమోదైంది. వెండి కూడా పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ క్షీణించింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.
దీంతో సెంటిమెంట్ బలహీనపడిందని బులియన్ ట్రేడర్లు పేర్కొన్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీరేట్లను కొనసాగింపుగా పెంచనున్నట్టు సంకేతాలు ఇవ్వడంతో, ఈ విలువైన మెటల్‌కు డిమాండ్ తగ్గుతోంది. గ్లోబల్‌గా ఒక్క ఔన్స్‌కు బంగారం ధర 0.32 శాతం క్షీణించి 1,223.30 డాలర్లుగా నమోదైంది. వెండి కూడా 0.84 శాతం తగ్గి, 15.41 డాలర్లుగా ఉంది. ఇక దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 250 రూపాయల చొప్పున తగ్గి, రూ.30,800గా, రూ.30,650గా రికార్డయ్యాయి. నిన్న కూడా బంగారం ధరలు 100 రూపాయలు తగ్గాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్‌లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more