"పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ... ఇవన్నీ కలిపితే నాగ శౌర్య...అయిదు సంవత్సరాలు నిర్విరామంగా పరిశ్రమలో నెలదొక్కుకోడానికి అహర్నిసలూ ప్రయత్నించాడు... అవకాశాలు రాలేదు సరి కదా, నిరాశే మిగిలింది... ఇక వెనుదిరిగి వెళ్లిపోదాం అనుకుంటున్నప్పుడు, కొత్తవారిని ప్రోత్సహించే వారాహి సంస్థ నుండి పిలుపు... కట్ చేస్తే... హీరోగా తొలి ప్రయత్నంలోనే అమ్మాయిల "ఊహలు గుస గుసలాడి"పించాడు నాగ శౌర్య... ఒక్కసారిగా పరిశ్రమలో హాట్ టాపిక్ గా, సీనియార్ అండ్ యంగ్ హీరోలకు గట్టి పోటీగా, లేడీస్ హాట్ ఫేవరేట్ గా టర్న్ అయిపోయాడు, తొలి సినిమాతోనే ఫేట్ టర్న్ అయిన నాగ శౌర్య... మ్యాన్లీ లుక్స్ + కళ్ళల్లో - నవ్వులో ఇన్నొసెన్స్ + తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ రోల్స్ ఎంచుకోవడం + ఎటువంటి ఇమేజ్ చక్రంలో కూరుకోకుండా, ప్రతీ సినిమాతో కొత్త ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంతో, శౌర్య మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోస్ లో ఒకడిగా సెటిల్ అయిపోయాడు...
"లక్ష్మీ రావే మాయింటికి" దగ్గరి నుండి, ది రీసెంట్ రిలీజ్ అండ్ సక్సెస్, "అమ్మాయితో అబ్బాయి", నందినీ రెడ్డి డైరెక్షన్లో, ట్రెయిలర్ తోనే అందరి అటెన్షన్ నూ కొట్టేసి, రిలీజ్ కి రెడీ అయిన, "కళ్యాణ వైభోగమే", స్పీక్ అబౌట్ శౌర్య పాషన్ టువర్డ్స్ మూవీస్... తెలుగు సినీ పరిశ్రమలో హీరోలకు కొదవలేకపోయినా, క్రియేటివ్ స్టోరీస్ చెయ్యాలని తపన పడే దర్శకులకు మాత్రం చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి... ఆ ఆప్షన్స్ లో ముందు వరుస లో ఉండేది, నాగ శౌర్య... "అబ్బాయితో అమ్మాయి", మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అంత కమ్మని విజయం సొంతం చేసుకుంది... ఇందుకు హ్యాపీగా ఫీల్ అవుతూనే, తన తరువాతి సినిమాల మీద దృష్టి పెట్టాడు నాగ శౌర్య... అన్ని ఎమోషన్స్ ను అంతే న్యాచురల్ గా పలికించగల, కళ్ళతో యాక్ట్ చెయ్యగల, డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ నీ సమానంగా ఎమోట్ చెయ్యగల వర్త్ ఉన్న హీరో నాగ శౌర్య...ఇండస్ట్రీ కి ఒచ్చిన షార్ట్ టైంలోనే వర్త్ మెన్షనింగ్ సక్సెస్ అందుకున్న శౌర్యకు, విజయం వరిస్తే పొంగిపోవడం మాత్రం తెలియదు... కల్మషం లేకుండా నవ్వడమే తప్ప!
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more
Nov 17 | తమిళ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో అజిత్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హీరో అనే గర్వం ఏమాత్రం లేకుండా సాధారణ ప్రజలతో సహా మమేకమయ్యే మంచి మనస్తత్వం కలిగిలిన... Read more