రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు ఎదురు చూస్తున్న హిట్ దాహాన్ని కూడా తీర్చేశాడు. ఇక మూడో సినిమా ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా! డిజాస్టర్ గా మిగిలినప్పటికీ, తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటూ ఎంటర్ టైనింగ్ డ్రామానే అందించాడు.
ఇక ఇప్పుడు స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథమ్ అలియాస్ డీజేగా రాబోతున్నాడు. యాక్షన్ కమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో డీజే రూపొందినట్లు ట్రైలర్ లు చూస్తేనే అర్థమైపోతుంది. బన్నీలోని ఎనర్జీ లెవల్స్ ను వాడేసుకుని అద్భుతంగా తెరకెక్కించినట్లు చెబుతున్నాడు హరీష్. ఇప్పటికే మ్యూజికల్ హిట్ గా కన్ఫర్మ్ చేసుకోగా, తెరపై బన్నీ ఎనర్జీ లెవల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందంటున్నాడు. కట్ట కాలే వరకు తాను పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఫ్యూఛర్ లో మళ్లీ ఛాన్స్ వస్తే పవర్ స్టార్ తో సినిమా తీసి తీరతానన్నాడు.
అంతేకాదు బన్నీ కెరీర్ లో ఇది మరో గబ్బర్ సింగ్ అవుతుందని కామెంట్ చేశాడు. ముఖ్యంగా బ్రహ్మిణి రోల్ లో స్టైలిష్ స్టార్ ఆకట్టుకుంటాడని చెబుతున్నాడు. ఇంతకు ముందు అదుర్స్ లో చారి(ఎన్టీఆర్ బ్రహ్మిణ్ రోల్ స్క్రీన్ ప్లే అందించింది కూడా హరీశే). మరి హరీశ్ అంతగా ఎగ్జయిట్ అవుతున్న డీజే అంతటి విజయాన్ని అందిస్తుందా? లేదా? చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more
Nov 17 | తమిళ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో అజిత్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హీరో అనే గర్వం ఏమాత్రం లేకుండా సాధారణ ప్రజలతో సహా మమేకమయ్యే మంచి మనస్తత్వం కలిగిలిన... Read more