నిరసనలు ఎక్కడైనా చూపించవచ్చు! భక్త రామదాసు తనను రక్షించటానికి రానందుకు తన ఇష్టదైవాన్నే దూషించాడు.! ఆధ్యాత్మిక కేంద్రాల్లోనూ విబేదాలు తలెత్తవచ్చు. మఠాలు, మఠాదిఫతుల మీద తిరుమల తిరుపతి దేవస్థానం, తితిదే మీద పీఠాధిపతులు పరస్పరం విమర్శలను చిందించటం కొన్నాళ్ళుగా సాగుతూనేవుంది. మఠాలకు కేటాయించిన భూముల్లో అనుమతులను అధిగమించి నిర్మాణాలు చేసారని, వాటిని వ్యాపరపరంగా వాడుకుంటున్నారని దేవస్థానం యాజమాన్యం ఆరోపిస్తే, ఆధ్యాత్మిక కేంద్రాలైన దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని ఆ మధ్య శారదా పీఠాధిపతి విమర్శిస్తే తాజాగా, మన దేవాస్థానాలు క్లబ్బులుగా మారాయని త్రిదండి జియ్యర్ స్వామి వ్యాఖ్యానించారు. దీనితో దేవస్థానం యాజమాన్యం, సిబ్బంది మఠాధిపతుల మీద నిరసనలు ప్రదర్శిస్తున్నారు. మఠాధిపతికి అలా మాట్లాడటం తగదని ఆక్షేపిస్తున్నారు. వెయ్యి కాళ్ళ మండపం మీద కక్షను ఇలా వెళ్ళబుచ్చుతున్నారని విమర్శిస్తున్నారు.
మఠాధిపతి కాబట్టి ఆయనేమీ అనగూడదు. సామాన్య ప్రజలకు ఏమైనా మాట్లాడే హక్కుంది అని అనటం కూడా సరైనది కాదేమో! క్లబ్ అనేదానికి విపరీతార్థం తీయాల్సిన అవసరం ఉందా? వినోదం కోసం వచ్చి అందుకు రుసుము చెల్లించే కేంద్రాలే క్లబ్బులు. ఆలయ వ్యవస్థలో కూడా జమ, ఖర్చులను మాత్రమే చూస్తున్నప్పుడు, సామాజిక బాధ్యతలను తీసుకోనప్పుడు వాటిని వ్యాపార కేంద్రాలుగానే పరిగణిస్తారు. ఎందరో శిష్యులకు ఆధ్యాత్మిక గురువులుగా చెలామణి అవుతున్నప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలలోని సమస్యల మీద స్పందించటంలో కూడా, ఈ మాటలు అనకూడదు, అలా మాట్లాడకూడదు అని అంటే ఎలా?
దొంగతనాలు, మోసాలు, అవినీతి, ఆరోపణలు, అధికారం, ఆదాయాలకోసం పోటీలు, అక్రమాలు ఎక్కడా జరగకూడదు. ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే కాదు, సమాజంలో ఎక్కడ జరిగినా సమాజ శ్రేయస్సులో అది మంచిది కాదు. అలాగే మఠాధిఫతులు మంచి మాటలే మాట్లాడాలన్నది నిజమే అయినా, వారికి చెడు అని అనిపించినదాన్ని కూడా 'చెడు' అని అనవద్దంటే ఎలా? ఎప్పుడూ సత్యాన్నే పలుకుతూ దైవచింతనలోనూ భక్తి ప్రచారంలోనూ జీవితాన్ని గడపవలసిన గురువులచేత ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం కల్పించామే అనే దిశగా ఆలోచిస్తే వీరు, సహనం చూపిస్తూ వారు వ్యవహరిస్తే అసలు గొడవలే రావు, భక్తుల మనోవేదనకూ దారితీయదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more