ఫెమినా, ఎకానామిక్ టైమ్స్, ది ఇలస్ట్రేటెడ్ వీక్లీలకు కార్టూన్లు వేసిన గోవాకు చెందిన ప్రఖ్యాత కార్టూనిస్ట్ మారియో మిరందా పనాజీలో నిన్న తన స్వగృహంలో మరణించారు. 85 సంవత్సరాల మారియో భార్య ఇద్దరు కుమారులను వదిలి నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. తన కార్టూన్లతో పాఠకులను ఆలోచింపజేసారు. ఆయన సృష్టించిన మిస్ నింబూ పానీ, మిస్ ఫోన్సేకా, ఖుష్వంత్ సింగ్ డ్రింకింగ్ పాత్రలు విశేష జనాదరణను పొందాయి. మారియో ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 1988 లో పద్మశ్రీ, 2002 లో పద్మభూషణ్ బిరుదులను ప్రదానం చేసింది. ఆయన పార్థివ శరీరానికి ఈరోజు అంత్యక్రియలు జరుపుతున్నారు.
1926లో జన్మించిన మారియో చిత్రకళమీద ఉన్న ఆసక్తితో తన ఇంటి గోడలను రంగులతో నింపేవారట. అది చూసి ఆయన తల్లి ఆయనకు పుస్తకాలను కొనిచ్చారట. ఎటువంటి శిక్షణా తీసుకోకుండానే మారియో చిన్నతనం నుంచీ చిత్రలేఖనం ద్వారా అందరినీ అలరించేవారు. ఆయన ఖర్చులకు కావలసిన సొమ్ముని సంపాదించుకునేవారు. ఐఏఎస్ అవుదామనుకుని, ఎడ్ ఏజెన్సీలో కాలుపెట్టి చివరకు కార్టూనిస్ట్ అయిన మారియో విదేశాల్లో కూడా తన ప్రతిభను చాటారు. లండన్ లో ఉన్న 5 సంవత్సరాల్లో వివిధ పత్రికలకు చిత్రాలను గీసిన మారియో లిలిపుట్, మాడ్, పంచ్ లాంటి అంతర్జాతీయ పత్రికలకు కూర్టూన్లు వేసారు. 1980లో మాతృదేశానికి తిరిగివచ్చి, భారత్ లోనే నివాసం ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత ఎన్నో ప్రఖ్యాత పుస్తకాలకు చిత్రాలనిచ్చారు.
సంగీత ప్రియుడు, పర్యటకుడు అయిన మారియో హబీబా హైదెరి అనే ఒక కళాకారిణినే పెళ్ళిచేసుకున్నారు. వారికి కలిగిన సంతానంలో రాహుల్ న్యూయార్క్ లో హెయిర్ స్టైలిస్ట్, రిషద్ గోవాలోనే తండ్రిలా కార్టూనిస్ట్.
మారియో మిరాందా మృతికి ఎందరో కళాకారులు, పత్రకారులు, రచయితలు ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more