విదేశీ ఖైదీలు వాళ్ళ శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా జైళ్ళల్లో మగ్గటాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. అది వాళ్ళ హక్కుని కాలరాయటమేనని ఉన్నతాసనం ఉద్ఘాటించింది. జస్టిస్ ఆర్ఎమ్ లోధా, జస్టిస్ హెచ్ ఎల్ గోఖలే ల ధర్మాసనం విదేశీఖైదీల తరఫున వచ్చిన పిటిషన్లను పరిశీలిస్తూ, వాళ్ళందరినీ వెంటనే వారివారి దేశాలకు పంపించేయాలని, ఆ పని పూర్తయిన నివేదికను ఫిబ్రవరి 28 లోపులో కోర్టుకి సమర్పించాలని హోంశాఖను ఆదేశించింది. శిక్షాకాలం పూర్తిచేసుకుని, పౌరసత్వం నిర్ధారణైన ఖైదీలను ఆయా దేశాల విదేశాంగ కార్యాలయాల ద్వారా వారి వారి దేశాలకు పంపించేయటానికి, పిటిషన్లు వచ్చి, కోర్టు కలుగజేసుకుని ఆదేశాలిచ్చిన తర్వాతనే ప్రభుత్వం అప్పటికప్పుడు ఆ పనులను చేపడుతూ వస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ ఖైదీలలో ఎక్కువగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, ఇరాన్ దేశస్తులే వున్నారు. వారిని సకాలంలో పంపించేయకుండా వారి స్వాతంత్ర్యాన్ని హరించి జైలు గోడల మధ్య ఉంచి ప్రభుత్వం తన విధులను విస్మరించిందని సుప్రీం కోర్టు ప్రకటించింది.
భారత పాకిస్తాన్ లమధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఒకరి దేశస్తులను మరొకరు అరెస్ట్ చెయ్యటం కానీ నిర్బంధంలో ఉంచటం కానీ చేస్తే మూడు నెలలలో ఆ విషయాన్ని వారి మాతృదేశానికి తెలియజేయాలి. కానీ చాలా కేసుల్లో శిక్షలు కూడా పూర్తయిన తర్వాతనే వారి విదేశాంగ శాఖలకు తెలియజేస్తున్నారు. దానితో వారి పౌరసత్వాన్ని సరిచూసి మిగిలిన తంతునంతా పూర్తిచెయ్యటానికి సమయం పడుతోంది. దానివలన అదంతా పూర్తయ్యేంత వరకూ వాళ్ళు ఇక్కడే ఉండాల్సివస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more