Tea to be declare as national drink

tea to be declare as national drink

tea to be declare as national drink

31.gif

Posted: 04/22/2012 05:15 PM IST
Tea to be declare as national drink

               mantekదాదాపుగా మనమంతా ఎంతో అలవాటుగా సేవించే ‘టీ’ కి ఠీవీ వచ్చింది. నా లెవెల్ పెరిగిందంటూ అందల మెక్కికూర్చోబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 'టీ'ని జాతీయ పానీయంగా ప్రకటిస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా హామీ ఇచ్చారు. అసోంలో మొదటిసారిగా తేయాకు చెట్లు నాటిన మణిరాం దివాన్‌ 212వ జయంతిని పురస్కరించుకుని జోర్హాత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాంటెక్ మాట్లాడుతూ దేశంలో ఎక్కువమంది మహిళలకు తేయాకు రంగమే ఉపాధి కల్పిస్తోందని అన్నారు.  దేశంలోని 83 శాతం కుటుంబాలలో టీ తాగడం విడదీయరాని భాగమైందని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో గౌహతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక చాయ్‌ బార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మాంటెక్ ప్రకటించారు. బ్లాక్ టీ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ఆయన తెలిపారు. కాఫీ తరహాలోనే తేయాకులో కూడా వైవిధ్యమైన రకాలను ఉత్పత్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్లాంటేషన్ యజమానులకు విజ్ఞప్తి చేసారు. మొత్తానికి ఇంతకాలానికి టీ కి మనం ఒక గౌరవాన్ని ఇస్తున్నామన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High alert in vijayanagaram
Amarnath yatra piligrims schedule release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles