High alert in vijayanagaram

high alert in vijayanagaram

high alert in vijayanagaram

1.gif

Posted: 04/23/2012 12:23 PM IST
High alert in vijayanagaram

             vzmmandalmap ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లా ఇవాళ రణరంగం గా మారిపోయింది. మద్యం సిండికేట్లపై విజయనగరం కలెక్టరేట్ ఎదుట టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ ధర్నాతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్ విధించారు. దీంతో జిల్లాలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టరేట్‌కు మూడు వేల మంది పోలీసులను మోహరించారు. ఇన్‌గేట్, ఔట్‌గేట్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు 2 కి.మీ మేర నిషేదాజ్ఞలు విధించారు. వాహనాల అనుమతిని నిరాకరించారు. ఇరు పార్టీ ధర్నాలతో జిల్లా అంతటా టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోనికి తీసుకుంటున్నారు. విజయనగరానికి 10 కి.మీ దూరంలోనే బస్సులను దారి మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. CHANDRABAB11
              ధర్నా కార్యక్రమంలో భాగంగా కొద్దిసేపటిక్రితం అశోక్‌గజపతిరాజు బంగ్లా నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలోని కలెక్టరేట్ వద్దకు భారీ ర్యాలీగా బయల్దేరారు. ఆయనతో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. మద్యం సిండికేట్లపై వ్యతిరేకంగా జిల్లాలోని కలెక్టరేట్ వద్ద చంద్రబాబు నాయుడు ధర్నా చేయబొతున్నారు.
              కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు (సోమవారం) ఉదయం విజయనగరం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయనగరానికి బయలుదేరిన చంద్రబాబు నాయుడుని ఆనందపురం మండలం బోయెపాలెం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో చంద్రబాబు , టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. చివరకు కార్యకర్తలు బ్యారికేడ్లను తొలగించడంతో బాబు కాన్వాయ్ విజయనగరానికి చేరుకుంది.
              botsa11కాగా విశాఖ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు స్వాగతం పలకడానికి వచ్చిన ఎమ్మెల్యేల కృష్ణబాబు, ఎయిర్‌పోర్టు సిబ్బందికి మధ్య వాగ్వాదం నెలకొంది. తోపులాటలో కృష్ణబాబు అద్దం పగిలిపోయింది. దీంతో ఆయనకు స్వల్పగాయాలయ్యాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వ పాలనా అని ప్రశ్నించారు. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందన్నారు. మొత్తంగా ధర్నాపేరిట జిల్లాలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలు నానా యాతన పడుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamta sharma on women taking being called sexy in a positive way
Tea to be declare as national drink  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles