Lakshmipur mla hikaka release by mavos

lakshmipur mla hikaka release by mavos

lakshmipur mla hikaka release by mavos

1.gif

Posted: 04/26/2012 12:03 PM IST
Lakshmipur mla hikaka release by mavos

             hikaka మొత్తానికి ఒరిస్సా లోని కోరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ ఎమ్మెల్యే (బీజేడీ) జిన్నా హికాక విడుదలయ్యారు. 32 రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్న హికాక ఇవాళ (గురువారం) ఉదయం విముక్తి పొందారు. కొరాపూట్ జిల్లాలోని విజయఘాటి అడవుల్లో నక్సల్స్ వదిలిపెట్టారు. కొద్దిసేపటిక్రితమే హికాక బలిపేటకు చేరుకున్నారు. ఇప్పటికే హికాక భార్య కౌసల్య, న్యాయవాది పట్నాయక్, బలిపేట అటవీప్రాంతానికి చెందిన  గిరిజనులు, కోరాపూట్ జిల్లా అధికారులు బలిపేటకు వచ్చారు.
               కాగా, మార్చి 24 న ఎమ్మెల్యే హికాకను బంధించిన మావోయిస్టులు పలు డిమాండ్లను ఒడిశా సర్కారుకు తెలిపారు. మావోల డిమాండ్ల ప్రకారం 25 మంది నక్సల్స్ ఖైదీలను విడుదల చేసేందుకు ఒడిశా సర్కారు అంగీకరించినప్పటికీ మావోలు తమ డిమాండ్లను పెంచుకుంటూ పోయారు.hika_2 నిన్నటితో డెడ్‌లైన్ ముగియడంతో మావోయిస్టులు ప్రజాకోర్టును నిర్వహించారు. ప్రజల అభిప్రాయాల మేరకు కొన్ని షరతులతో హికాకను మావోయిస్టులు విడుదల చేశారు.
               ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేడీ నుంచి తప్పుకుంటానని హికాక లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. దీంతో దాదాపు నెల రోజులకు పైగా సాగిన ఉత్కంఠకు తెరపడింది. హికాకాను మావోయిస్టులు తనను మావోయిస్టులు విడుదల చేశారని ఎమ్మెల్యే మీడియాకు ఫోన్ లో సమాచారం అందించారు. రేపో మాపో హికాకా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dammu benefit show ticket rate
Jgan west godavari district on by election campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles