Tdp mla t v rama rao alleges assault by servant maid

TDP MLA T V Rama Rao alleges assault by servant maid, police case, MLA Wife, grandson, Hyderabad,

TDP MLA T V Rama Rao alleges assault by servant maid

TDP.gif

Posted: 06/22/2012 04:52 PM IST
Tdp mla t v rama rao alleges assault by servant maid

TDP MLA T V Rama Rao alleges assault by servant maid

హైదరాబాద్ లో తన కుటుంబంపై  పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు  ప్రాంతానికి  చెందిన వీరభద్ర కుమారి అనే మహిళ  దాడి చేసిందని  కొవ్వూరు ఎమ్మెల్యే  రామారావు  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.  ఆమె తనపై  తప్పుడు  ప్రచారం  చేస్తానని  కొంతకాలంగా  వేధింపులకు  గురిచేస్తోందని సైఫాబాద్ ఠాణా వద్ద ఫిర్యాదు  చేసిన అనంతరం  ఆయన విలేకరులకు  తెలిపారు.  తనను బ్లాక్ మెయిల్ చేసి ఇప్పటిదాకా నగదు, చెక్కుల  రూపేణా రూ. 2.43 లక్షల దాకా వసూలు చేసినట్లు  పేర్కొన్నారు.   రెండేళ్లుగా కొనసాగుతున్న వేధింపులు  ఏడాదిగా  తీవ్రమయ్యాయని  చెప్పారు.  ఎమ్మెల్యే రామారావు  బ్యాంకు  పనిపై  సచివాలయందాకా తన భార్యతో  కలిసి వెళ్లానని,  ఆ తర్వాత  ఆమెను తాము  ఉంటున్న ఆదర్శ నగర్ ఎమ్మెల్యే  కాలనీలోని  ఇంటిలో  దింపానని  చెప్పారు.  అనంతరం  తాను బయటకు  వెళ్లగా వీరభద్రకుమరి అనే మహిళ ఇంటికి వచ్చి దాడి చేసినట్లు  తనకు ఫోన్  వచ్చిందని  తెలిపారు.  తాను వెంటనే వెళ్లి ప్రశ్నించగా  తనపై దురుసుగా  ప్రవర్తిస్తూ  చొక్కాను  లాగి చింపేసిందని చెప్పారు.  బెదిరింపు ఫోన్లపై  15 రోజుల కిందట  పశ్చిమ గోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.  ఆమె విధ్వంసం  కారణంగా తన భార్యతో పాటు  ఏడాదిన్నర మనవడు  గాయపడ్డాడని  వివరించారు.  ఆమె నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ లు, మాటలు  రికార్డు  చేశానని  వాటిని బయటపెడతానని  చెప్పారు.  ఎమ్మెల్యే  ఫిర్యాదు  మేరకు  సైఫాబాద్  పోలీసులు  సదరు మహిళను  అదుపులోకి  తీసుకుని విచారిస్తున్నట్లు  సమాచారం. అసలు విషయం ఏమిటంటే.. ఆమె రామారావు ఇంటిలో పని మనిషి అని స్థానికులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raja pervaiz ashraf to be pakistan new pm
More water on the moon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles