రాష్ట్రంలో కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలతో విసిగిపోయిన కొందరి మనోవేదన ఇలా ఉంది. మా ప్రజలు విశాల హృదయులు. మీ దగ్గర డబ్బుంటే మిమ్మల్ని పార్లమెంట్ కు సైతం పంపగల సహృదయులు. డబ్బుంటే రండి.. మా ఆంద్రప్రదేశ్ కు మీకిదే స్వాగతం సుస్వాగతం.. గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటుంది. అవినీతికి, సినీ నటి రంజితతో రాసలీలల కేసులో ఇరుక్కున్న నిత్యానంద స్వామికి లింక్ పెట్టి ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో అటు వైపు వెళ్లే వారి అందరి దృష్టిని అది ఆకర్షిస్తోంది. విషయానికి వస్తే నిత్యానంద స్వామికి, అవినీతికి లింక్ పెడుతూ గుంటూరులో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ది మూన్ సేన పేరుతో దీనిని ఏర్పాటు చేశారు.
అందులో నిత్యానందకు వెటకారపు వ్యాఖ్యల ద్వారా స్వాగతం పలికారు. ఆయనకు వెటకారంగా స్వాగతం పలుకుతూనే రాష్ట్రంలోని అవినీతిపై కూడా ఎద్దేవా చేశారు. ఆ ప్లెక్సీలో.. తమిళనాడు, కర్నాటకలలో ఛీత్కారాలతో సతమతమవుతున్న నిత్యానంద స్వామికి సాదర స్వాగతం.. నేటి మా ఎపి అక్రమార్కులకు, అవినీతిపరులకు అండగా ఇక్కడి క్రింది స్థాయి న్యాయవ్యవస్థ వరకు జీతాలు తీసుకుంటున్న వారు అవినీతికి పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నారు.
ఈ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలోని అవినీతి, నిత్యానంద స్వామి లీలలకు పెద్దగా తేడా లేదని అంతకన్నా అవినీతే అతి దారుణమన్నట్టుగా ఫ్లెక్సీలో పేర్కొనడం ఆకర్షిస్తోంది. అవినీతిని విమర్శిస్తూనే నిత్యానందకు వెటకారంగా స్వాగతం పలకడం విశేషం. కాగా నిత్యానంద స్వామి సినీ నటి రంజితతో రాసలీలల కేసుతో బజారున పడ్డ విషయం తెలిసిందే. అప్పటి నుండి నిత్యానందను ఏదో ఒక వివాదం చుట్టుకుంటోంది.
రంజితతో రాసలీలల వ్యవహారం రెండేళ్ల క్రితం బయటపడింది. ఆ తర్వాత మరో తమిళ నటిపై పలుమార్పు రేప్‌కు పాల్పడ్డాడని, పవిత్ర జలంలో డ్రగ్స్ కలుపుతున్నారని, తాజాగా పులి చర్మం కప్పుకొని దీక్ష చేస్తున్నారని, ఏనుగు దంతాలు కూడా ఆయన ఆశ్రమంలో ఉన్నాయనే ఆరోపణలు వచ్చిన విషయం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more