Caller tunes problems

Caller tunes Problems

Caller tunes Problems

Caller.gif

Posted: 07/04/2012 12:40 PM IST
Caller tunes problems

Caller tunes Problems

ఇటీవల చాలా మంది ఫోన్‌కు కాలర్‌ ట్యూన్స్‌ పెట్టుకుంటున్నారు. ఎవరైనా ఫోన్‌ చేసినపుడు వారికి రింగ్‌..రింగ్‌ శబ్దానికి బదులు మంచి మాట వినిపిస్తుందన్న మాట. కాలర్‌ ట్యూన్స్‌ సెల్‌ఫోన్‌ కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇది ఆ కంపెనీలకు అదనపు ఆదాయ వనరుగా ఉంది. అయితే ఈ కాలర్‌ ట్యూన్స్‌ వల్ల ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంచి సంగీతమో, ఆహ్లాదకరమైన పాటలైతే ఫర్వాలేదుగానీ...ఇబ్బందికరమైన ద్వందార్థలు ధ్వనించే పాటలు, సినిమా డైలాగులను కాలర్‌ ట్యూన్స్‌గా పెట్టుకుంటున్నారు. మీ సెల్‌కు బంధువులు ఫోన్‌ చేయొచ్చు, ఉన్నతాధికారులు కాల్‌ చేయొచ్చు, మహిళలు, పిల్లలు ఫోన్‌ చేయొచ్చు..ఎవరైనా చేయొచ్చు. అదేవిధంగా వివిధ సందర్భాల్లో ఫోన్‌ చేయొచ్చు. ఎవరు చేసినా, ఏ సందర్భంలో చేసినా మన కాలర్‌ ట్యూన్‌ ఇబ్బంది కలిగించని విధంగా ఉండాలి. ఉదాహరణకు మీ ఉన్నతాధికారి ఫోన్‌ చేశారనుకుందాం...అప్పుడు మీ సెల్‌లో 'ఇప్పటికింక నా వయసు నిండా పరహారే..' అని పాటి వినిపిస్తే బాగుండదు. అదేవిధంగా మీ బంధువులే ఏదైనా విషాదకర వార్త చెప్పడం కోసం ఫోన్‌ చేశారనుకోండి...అప్పుడు 'కెవ్వు కేక...' అంటూ మీ సెల్‌ నుంచి పాట వినిపించిందనుకోండి...అవతలివారు కొంత ఇబ్బందికి గురయ్యే ప్రమాదముంది. అందుకే కాలర్‌ ట్యూన్స్‌ పెట్టుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

1. ఆఫీసు ఫోన్లు, మీ అధికారులు, ఆఫీసు సిబ్బంది కాల్‌చేసే ఫోన్లకు కాలర్‌ ట్యూన్స్‌ పెట్టుకోకపోవడమే మంచిది. ఒకవేళ మీ ఫోన్‌ బిల్లు ఆఫీసు చెల్లిస్తుంటే...కాలర్‌ ట్యూన్‌ పెట్టుకున్న మేరకు ఆఫీసుకు నష్టమే. దీనిపై బాసు మిమ్మల్ని ప్రశ్నించకపోయినా మీరు కంపెనీ డబ్బులు వృథా చేస్తున్నారన్న భావన ఏర్పడుతుంది.

2. కాలర్‌ ట్యూన్‌ పెట్టుకుంటే మీకు కాల్‌ చేసిన వారిని ఆహ్లాదపరిచేవిధంగా అది ఉండాలి. అదేవిధంగా సినిమాలు, ప్యారడీ డైలాగులతో ఉండే కాలర్‌ ట్యూన్‌ పెట్టొద్దు.

3. మీరు ఏర్పాటు చేసుకునే కాలర్‌ ట్యూన్‌ను బట్టి మీ అభిరుచి ఎలాంటిదో అవతలివారికి తెలిసిపోతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

4. ఈ కాలర్‌ ట్యూన్‌ వల్ల మీరు ఆనందించేది ఏమీ లేదన్న విషయం తెలుసుకోండి. మీ ఫోన్‌కు మీరు ఎప్పుడూ కాల్‌ చేయరు. మీరు డబ్బులు పెట్టి కాలర్‌ ట్యూన్‌ పెట్టుకుంటే ఎవరో వింటారు. దానివల్ల ప్రయోజనమేమిటో ఆలోచించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aata 5 winner geethika meet with accident
High court rejects his jagan bail plea  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles