Ap bhavan employees slipper attack on trs leaders

AP Bhavan Employees Slipper Attack on TRS Leaders

AP Bhavan Employees Slipper Attack on TRS Leaders

Attack.gif

Posted: 07/21/2012 12:33 PM IST
Ap bhavan employees slipper attack on trs leaders

AP Bhavan Employees Slipper Attack on TRS Leaders

ఏడాది కిందట తెలంగాణ కోసం ఢిల్లీలో యాదిరెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్న సందర్భంగా జరిగిన గొడవలో ఏపీ భవన్ అటెంటర్ ను  కొట్టినందుకు తాము గర్వపడుతున్నామని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణకు అడ్డుపడుతున్న సీమాంధ్ర మంత్రులను కాల్చి చంపాలని వ్యాఖ్యానించారు. యాదిరెడ్డి ప్రథమ వర్థంతి సభ తెలంగాణ భవన్‌లో జరిగింది. యాదిరెడ్డిని అనాథగా పేర్కొంటూ శవాన్ని మార్చురీ నుంచి నేరుగా శ్మశానానికి తరలించాలని ఏపీ భవన్ అధికారి రాసిన లేఖ చూసిన తర్వాత తమకు బాధ, ఆవేశం కలిగాయని టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఏపీ భవన్ సిబ్బందిని కొట్టినందుకు తాము గర్వపడుతున్నామన్నారు.

AP Bhavan Employees Slipper Attack on TRS Leaders

తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానాలకు సీఎం కిరణ్, చంద్రబాబు, జగన్ వంటి సమైక్యవాదులే కారణమని ఆరోపించారు. చేనేత కార్మికులను టీఆర్ఎస్ ఆదుకుందన్నారు. వారిని ఆదుకోవడం మీకేం తెలుసని సిరిసిల్లలో ధర్నాకు సిద్ధమవుతున్న వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే విజయలక్ష్మిని ఉద్దేశించి ప్రశ్నించారు. బతికి ఉన్నప్పుడు వైఎస్ చంపిన నేత కార్మికులకు నివాళి అర్పించే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. "తెలంగాణను అడ్డుకున్న ద్రోహి జగన్ కాదా? అలాంటి ద్రోహి పార్టీ తరఫున సిరిసిల్లకు వచ్చే నైతిక హక్కు విజయలక్ష్మికి లేదు. ఆమె ఎట్లా వస్తారో చూస్తామని తెలంగాణవాదులు అంటున్నారు. విజయలక్ష్మి సిరిసిల్లకొచ్చే మూర్ఖపు ప్రయత్నం చేయొద్దు. తెలంగాణలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయొద్దు. ఒకవేళ ఆమె వస్తే జరిగే పరిణామాలకు వైసీపీ, ప్రభుత్వానిదే బాధ్యత'' అని హెచ్చరించారు.

AP Bhavan Employees Slipper Attack on TRS Leaders

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heavy rains lash hyderabad9 killed
Telangana jagruthi leader kavitha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles