Vinayaka chavithi subhakanshalu

Vinayaka Chavithi Subhakanshalu,Happy Ganesh Chaturthi ... Ganesh Chaturthi Wishes

Vinayaka Chavithi Subhakanshalu

Vinayaka 1.gif

Posted: 09/18/2012 06:33 PM IST
Vinayaka chavithi subhakanshalu

Vinayaka Chavithi Subhakanshalu

గణపతి రూంప మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆయన పాదాల నుంచి తలదాకా  ఎన్నెన్నో యోగ, శాస్త్ర సంబంధమైన సంకేతాలు  కనిపిస్తాయి.  సాధకుడు, సాధన, లక్ష్యం అన్నీ ఆ రూపంలో  సమ్మిళితమై ఉంటాయి.  వాటిని విశ్లేషిస్తే ఎలా ఉంటాయో ముద్గల పురాణంలాంటి  పురాణాలు  ఇలా పేర్కొంటున్నాయి. 

 గజ ముఖం

 గజ అనే శబ్దానికి  కేవలం ఏనుగు అనే అర్థమే కాకుండా భారీ, గొప్ప అనే అర్థాలు  కూడా ఉన్నాయి.  అంటే తల నిశ్చయం , జ్నానం అనే వాటికి  సంకేతం, కనుక జ్నానాన్ని  బాగా వ్రుద్ది చేసుకోవాలని  ద్రుఢసంకల్పం, లక్ష్యం , దీక్ష అనేవి  అవసరం అనే విషయం  గజానాన్ని  చూస్తే స్పూరిస్తుంటుంది.

పెద్ద  చెవులు

 ఈ పెద్ద చెవులు ఎక్కువగా వినటం అవసరం అనే విషయాన్ని  ప్రకటిస్తుంటాయి. కొంతమంది  తాము జ్నానవంతులమని, ఎదుటివారు చెప్పింది వినాల్సిన అవసరం లేదని  అనుకొంటూ ఉంటారు. కానీ జ్నానం , పాండిత్యం  అనేవి ఎదుటి వారి నుంచి  ఎంత ఎక్కువుగా వింటే  అంత మేలు.  ఈ విషయాన్నే  ప్రకటిస్తుంటాయి వినాయకుడి చెవులు.

తొండం

 ఏనుగు తొండం ఒక విశిష్టమైన అవయవం. అది ఎంత పెద్ద పెద్ద బరువైన వాటిని  మోయగలదో  సన్నటి  సూది లాంటి దాన్ని  కూడా నేలమీద నుంచి పైకి తీయగలదు.  అలా చిన్న పెద్దా పనులన్నీ  చేయగల సామర్థ్యాన్ని  అందరూ పెంచుకోవాలని  ఇచ్చే సంకేతానికి ప్రతీకే తొండం.

దంతాలు

 మంచి చెడులకు, పాపపుణ్యాలకు , వివేక అవివేకాలకు ఇవి సూచకాలు . వినాయకుడికి  ఉన్న రెండు దంతాలలో ఒక దంతం విరిగి ఉంటుంది.  ఒకసారి కైలాసంలో  పరశురాముడికి, వినాయకుడికి  జరిగిన యుద్దంలో  పరుశురాముడి గండ్ర గొడ్డలి దెబ్బకు ఒక దంతం విరిగింది. ఈ సన్నివేశం  అహంకార  నాశనానికి ఉదాహరణగా మన పురాణాలు పేర్కొంటున్నాయి.  అహంకారం ఉండకూడదని  అందరికీ తెలియచెప్పేందుకు వినాయకుడు ఏకదంతుడిగా  కనిపిస్తుంటాడు.

 పెద్ద నోరు

 ఇది అనంతరమైన విశ్వానికి ప్రతీక.  అనంత విశ్వంలో అనేక విశేషాలుంటయని, మనకు తెలిసిందొక్కటే  గొప్ప  అని అనుకోకుండా  ఇంకా విశేషాంశాలు ఏవి ఉన్నాయో  తెలుసుకుంటూ ఉండేందుకు  సద్గురువులను అడుగుతూ  సందేహాలను  పోగొట్టుకుంటూ  ఉండాలనే  సూచనను ఇది చేస్తుంది.

లంబోదరం

 వినాయకుడి పెద్ద పొట్ట బ్రహ్మాండానికంతటికీ ప్రతీక.  గణేశుడు మనకు కనిపించే ఏదో  మామూలు దేవుడు కాదని సకల బ్రహ్మాండానికి ఆయన అధిపతి అనే విషయాన్ని లంబోదరం ప్రకటిస్తుంది.

నాగయజ్నోపవీతం

వినాయకుడికి యజ్నోపవీతం ( జందెం)  సర్పం ఒకటి కనిపిస్తుంది.  ఇంద్రియలోలత్వం  లాంటి క్రూరమైన విషప్రవ్రుత్తిని తనను ఆశ్రయించిన వారిలో  నశింప చేస్తాడు  వినాయకుడు అని ఇది తెలియచేస్తుంటుంది.  క్రూరమైన సర్పాన్ని  యజ్నోపవీతంలా  చేయటమంటే అది సామాన్యమైన  విషయం కాదు.  ఎంతో గొప్ప శక్తి  ఉంటేనే సాధ్యమవుతుంది.  చంచలమైన  మనస్సును  ఆ సర్పంగా  భావించి  దాన్ని  జయించిన  వాడు వినాయకుడు  అనే విషయాన్ని  స్పురింపచేస్తుంది నాగయజ్నోపవీతం.

నాలుగు చేతులు

గణేశుడికి  ఉన్న నాలుగు చేతుల్లో  ఒకటి  మనస్సుకు, రెండు బుద్దికి, మూడు చిత్తానికి, నాలుగు అహంకారానికి  సంకేతాలు. నాల్గిటికి మూలమైన శుద్ద చైతన్యమే గణపతి  తత్వం అని చెప్పటమే  నాలుగు  చేతులుండటంలో  విశేషం.  ఇలా గణనాయకుడి రూపంలో  స్థూలంగా కొన్ని విశేషాలు కనిపిస్తుంటాయని ఈ కథా సందర్భం వివరిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police involved in illegal activity in tirumala
Ministers son claims he is owed rs 2cr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles