Theft in temple triggers tension in old city

Theft in temple triggers tension in old city, Sri Simhavahini Mahankali temple, investigations, Minister, Geetha Reddy,

Theft in temple triggers tension in old city

Mahankali.gif

Posted: 10/11/2012 05:50 PM IST
Theft in temple triggers tension in old city

Theft in temple triggers tension in old city

హైదరాబాద్  పాతబస్తీలో ఉన్న మహంకాళీ  ఆలయంలో  భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే  దీనిపై  భక్తులు  తీవ్రంగా  మండిపడుతున్నారు.  లాల్‑దర్వాజ మహంకాళీ ఆలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. అమ్మవారి ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకోవాలంటూ భక్తులు పాతబస్తీలో ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, భక్తుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగా నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులతో ఆయన చర్చలు జరుపుతున్నారు.  మహంకాళి  దేవాలయానికి  పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని  మంత్రి గీతారెడ్డి హామీ ఇచ్చారు.  దేవాలయం చుట్టూ నిఘా కెమెరాలు  ఏర్పాటు చేయనున్నట్లు  ఆమె చెప్పారు.  దేవాలయంలో చోరీ చేసిన నిందితులను  త్వరలోనే పట్టుకుంటామని  మంత్రి హామీ ఇచ్చారు.  మంత్రి హామీతో  ఆలయ ఉమ్మడి కమిటీ, స్థానికులు చేపట్టిన  ఆందోళన విరమించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Child sexual abuse doctypes
Boat accident in bihar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles