Cbi vehicle stone pelted in up

cbi, uttar pradesh, raju bhayya

cbi vehicle stone pelted in up

attack-on-cbi.png

Posted: 03/13/2013 11:15 AM IST
Cbi vehicle stone pelted in up

zia-ul-haqఉత్తర్ ప్రదేశ్ లోని మాణిక్ పూర్ గ్రామంలో సిబిఐ వాహనం మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేసారు.  ప్రతాప్ గఢ్ గ్రామంలో జరిగిన మూడు హత్యల రహస్యాన్ని ఛేదించటానికి ఐదు రోజుల క్రితం అక్కడకు వెళ్ళి దర్యాప్తు సాగిస్తున్న సిబిఐ దర్యాప్తు బృందం మీద మాణిక్ పూర్ సమీపంలో రాళ్ళు విసిరి ముందు అద్దాలను పగలగొట్టగా, వాహనం నడుపుతున్న డ్రైవర్ కి గాయాలయ్యాయి.  పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కలంతా గాలించారు కానీ ఆచూకీ తెలియలేదు.  ఆ గుర్తు తెలియని వ్యక్తులమీద కేసునైతే నమోదు చేసారు.

ఈ కేసులో మాజీ రాష్ట్ర మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ (రాజ్ భయ్యా) మీద ఆరోపణ ఉంది.  అయితే దాడి చేసిందెవరన్నది తొందరపడి ఊహలకు ఊతం ఇవ్వగూడదని సిబిఐ అధికారులన్నారు.  అరోపణ ఎదుర్కున్న రాజ్ భయ్యా అక్కడ స్వతంత్ర శాసన సభ్యుడు.  కుందా నియోజక వర్గనికి చెందిన వారు.  ఆయన ఆ సమయంలో ఘటనా స్థలిలో లేనంటూ చెప్తూవచ్చారు.  లక్నోలో కాళిదాస్ మార్గ్ లోని తన స్వగృహంలో ఉన్నానని అన్నారు.  అప్పట్లో ఆయన ఐదురోజుల పాటు సిబిఐ కస్టడీలో ఉన్నారు కూడా.  

కేసు లో ఇంతవరకూ, షూటింగ్ జరగటం అందులో గ్రామ పెద్ద తమ్ముడు సురేశ్ యాదవ్ మరణించటం, అంతలో పోలీసు బృందాలు రావటం, అందులో సర్కిల్ ఇన్స్ పెక్టర్ ని హత్య చెయ్యటం, వీటన్నిటినీ ఒక్కో విషయాన్ని లోతుగా దర్యప్తు చేస్తున్న సిబిఐ,  సర్కిల్ పోలీస్ అధికారి జియా ఉల్ హక్ గుండెల్లోకి దూసుకుని పోయి బయటకు వచ్చిన తుపాకీ గుండుని వెతకి పట్టుకుని ఆరా తియ్యటానికి ప్రయత్నిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Militant attackpng
Question hour of both houses were wasted  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles