Militant attackpng

militant-attack.png

Posted: 03/13/2013 12:24 PM IST
Militant attackpng

reserve-police-attackedజమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రిజర్వ్ పోలీసుల మీద దాడిచేసారు.  శ్రీనగర్ బెమినా ప్రాంతంలోని ఒక పాఠశాల సమీపంలో క్యాంప్ చేసిన కేంద్ర రిజర్వ్ పోలీసుల మీద ఆకస్మిక దాడి చేసారు.  స్పందించిన పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు.  గత మూడు సంవత్సరాలలో జమ్మూ కాశ్మీర్ లో ఇది మొదటి ఆత్మాహుతి దాడి అని చెప్తున్నారు.  
ఈ సంఘటనలో పోలీసు జవాన్లు ఐదుగురు, ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.  ఏడుగురు జవాన్లు గాయపడ్డారు.  గాయపడ్డవారిని మిలిటరీ హాస్పిటల్ కి తరలించారు.  
అఫ్జల్ గురు భౌతికకాయాన్ని అతని కుటుంబీకులు ఇవ్వని ప్రభుత్వం మీద నిరసనగా బంద్ పిలుపు వలన పాఠశాల ముందుగానే మూతపడివుంది.  
బాంబులు విసిరి జవాన్ల మీద ఇష్టమొచ్చినట్టుగా కాల్పులు జరిపిన ఫిదాయీలు (ఆత్మాహుతి దళ సభ్యులు) కొందరు పట్టుబడ్డారు.  వాళ్ళను ముందు న్యూట్రలైజ్ చేసి ఇతరులకోసం గాలిస్తున్నారు.  చనిపోయిన వారిని గుర్తించి వారి ద్వారా వాళ్ళ ముఠా వివరాలను కనుక్కునే పనిలో ఉన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Budget assemblypng
Cbi vehicle stone pelted in up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles