Assembly heated over cag

cag, ap assembly, chief minister, tdp party, kiran kumar reddy, payyavula kesav

assembly heated over cag

cag-reports.png

Posted: 03/26/2013 09:23 AM IST
Assembly heated over cag

payyavula

ప్రభుత్వ ఆడిటర్ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలను అంత పట్టించుకోనక్కరలేదు అన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటలను తెలుగు దేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ తప్పుపట్టారు. దానితో మాటా మాటా పెరిగి సభ కాస్తా రభసయింది.

విద్యుత్ కొరత, విద్యుత్ సమస్యల మీద శాసన సభలో జరిగిన చర్చలో, కాగ్ నివేదికను ఉటంకిస్తూ, పయ్యావుల కేశవ్, 5000 కోట్ల బొగ్గు కుంభకోణం వలనే విద్యుత్ ఉత్పాదనలో ఆటంకం ఏర్పడిందన్నారు.   ఉన్నత శ్రేణి బొగ్గుకి ఇవ్వదగ్గ ధరకు తక్కువ శ్రేణి బొగ్గుని దిగుమతి చేసుకున్నారని, ఈ వ్యవహారంలో 500 కోట్ల రూపాయలు చేతులు మారటమే కాకుండా, తక్కువ శ్రేణి బొగ్గు వలన, మన విద్యుదుత్పాదన సంస్థల క్షమతకు తగ్గ ఉత్పాదనను చెయ్యలేక పోయాయన్నారాయన. అంతే కాకుండా కాగ్ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఖజానాకు 4800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కూడా చెప్పారు.

దానికి ముఖ్యమంత్రి, కాగ్ నివేదికకు కొన్ని అకౌంటింగ్ పద్ధతులను అనుసరించి చెయ్యటం జరుగుతుందని, దాని వలన ఏదో కుంభకోణం జరిగిపోయిందనే అభిప్రాయం ఏర్పడుతుంటుందని, వీటిమీద ప్రభుత్వ వివరణలను తీసుకోకముందు చేసిన ప్రకటనలని, ప్రభుత్వం ఇచ్చిన వివరణల వలన కొన్ని అభ్యంతరాలు సమసిపోతుంటాయని అన్నారు. కాగ్ నివేదికనేమీ పవిత్రమైనది, పరిపూర్ణమైనదిగా తీసుకోనక్కర్లేదన్నారు ముఖ్యమంత్రి. అందుకు ఉదాహరణగా శ్రీశైలం రివర్సిబుల్ టర్బైన్ ప్రాజెక్ట్ లో ప్రభుత్వం 13000 కోట్ల రూపాయల నష్టం చెందిందని ఇచ్చిన కాగ్ రిపోర్ట్ అధిక శాతం ప్రతిపక్షంతో కూడిన హౌస్ కమిటీలో వీగిపోయిందని చెప్పారు.

ఆ విధంగా ప్రభుత్వ ఆడిటర్ ని తక్కువ చేసి మాట్లాడం సరికాదంటూ పయ్యావుల అభ్యంతరం తెలియజేసారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Earth quake near guatemala with 62 magnitude
Restrictions to celebrate holi festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles