Earth quake near guatemala with 62 magnitude

guatemala, us geological survey, earth quake at guatemala, earth quake in nov 2012

earth quake near guatemala with 6.2 magnitude

guatemala-quake.png

Posted: 03/26/2013 09:52 AM IST
Earth quake near guatemala with 62 magnitude

guatemala

గ్వాటిమాలకు సమీపంలో ఈ రోజు ఉదయానే భూప్రకంపనలు జరిగినట్లుగా అమెరికా జియాలాజికల్ సర్వే ప్రకటించింది. 6.2 తీవ్రతతో సంభవించిన ఈ ప్రకంపం వలన నష్టం జరిగినట్లుగా ఎటువంటి సమాచారమూ అందలేదు సరిగదా, గ్వాటిమాలా వాసులకు పెద్దగా ప్రకంపనలు తెలియలేదు కూడా.

భూకంపం జరిగిన కేంద్రస్థానం శాన్ జోస్ పినుల కి వాయువ్యలో 6 కిలోమీటర్ల దూరంలో 200 కిలోమీటర్ల లోతున ఈ ప్రకంపనాలు జరిగాయని రెక్టర్ స్కేల్ చెప్తోంది. గ్వాటిమాలా పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో జరిగినా పెద్దగా ఎవరికీ తెలియకపోవటానికి కారణం ప్రకంపనాలు చాలా లోతుగా జరగటమేనంటున్నారు. 2012లో 7.4 తీవ్రతతో జరిగిన ప్రకంపనం వలన గ్వాటిమాలా లో 42 మంది మరణించారు. దానికి కారణం అది కేవలం 32 కిలోమీటర్ల లోతులో సంభవించిన ప్రకంపనం కావటమే. అంతకు ముందు 1976లో జరిగిన భూకంపంలో గ్వాటిమాలాలో 23000 మందికి ప్రాణ నష్టం కలిగింది.

అగ్ని మాపక దళాలు తయారీలోనే ఉన్నాయి కానీ ఇంతవరకూ ఎటువంటి నష్టం జరిగిన సమాచారమూ రాలేదని అగ్నిమాపక దళానికి చెందిన మేరియో క్రూజ్ అన్నారు.

 -శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cag report on state budget submitted to assembly
Assembly heated over cag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles