Advani helicopter emergency landing at begumpet

advani emergency landing, l k advani, bharatiya janata party, advani copter landed at begumpet, karnataka elections, hubli, telangana issue

advani helicopter emergency landing at begumpet

బేగంపేటలో అద్వానీ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Posted: 04/30/2013 01:22 PM IST
Advani helicopter emergency landing at begumpet

భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎల్ కే అద్వానీ కర్నటకలో ప్రచారానికి సుడిగాలి పర్యటనలో వెళ్తుండగా ఆయన ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ బేగం పేటలో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయవలసి వచ్చింది.  

వెళ్ళవలసింది కర్నాటకలో గడగ్ అయితే, దారి తప్పిన హెలికాప్టర్ పైలట్ ఫ్యుయల్ కూడా తక్కువగా ఉండటం గమనించి హైద్రాబాద్ బేగం పేటలో హెలికాప్టర్ ని దింపవలసి వచ్చింది.  

విషయం తెలిసిన హైద్రాబాద్ లోని స్థానిక నాయకులు రామచంద్రరావు, మల్లారెడ్డి తదితరులు బేగం పేటకు పోయి అద్వానీని కలిసారు.  వాళ్ళు తెలంగాణా సమస్యను చర్చించటంతోపాటు కర్నాటకలో పుంజుకున్న భాజపా గురించి కూడా మాట్లాడుకున్నారు.

అనుకోని మజిలీ వలన కర్నాటకలో అద్వానీ ప్రసంగించాల్సిన షెడ్యూల్స్ లో మార్పులు చెయ్యవలసి వస్తోంది.  గడగ్ లో ప్రసంగం తర్వాత ఆయన కర్నాటక ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ తో కలిసి సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభకు హాజరు కావలసి వుంది.  

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles