Political kcr calls medak district bund on may 3rd

medak bundh on may 3rd, kcr, trs, chief minister kiran kumar reddy, bangaru talli govt scheme, harish rao, no confidence motion, bayyaram mines, visakha steels

political kcr calls medak district bund on may 3rd

మెదక్ లో మే 3న బంద్ పిలుపునిచ్చిన కెసిఆర్

Posted: 04/30/2013 02:47 PM IST
Political kcr calls medak district bund on may 3rd

మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద మండిపడ్డ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు మే 2న మెదక్ జిల్లా బంద్ కి పిలుపునిచ్చారు. 

బయ్యారం గనులను విశాఖ స్టీల్స్ కి ఇవ్వటం కేవలం తెలంగాణా సంపదను దోచుకోవటమేనంటూ ప్రచారం చెయ్యటమే కాకుండా తెలంగాణా లో స్టీల్ ప్లాంట్ ని వెంటనే స్థాపించే ప్రయత్నాలు చెయ్యవలసిందిగా లేఖను రాసిన తెల్లవారే కిరణ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లాలో కెసిఆర్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. 

అవిశ్వాస తీర్మానంలో మెడలు వంచి సాధిస్తం అన్న తెలంగాణా నాయకుడు హరీష్ రావుకి సమాధానంగా ఎప్పుడేం ఇవ్వాలో మాకు తెలుసు, మీ దగ్గర నేర్చుకోనక్కర్లేదు, మీరు చెప్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వం అన్న కిరణ్ కుమార్ రెడ్డి మాటలను కూడా గుర్తు చేస్తూ కెసిఆర్, చూసారా తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడట, ఎవరబ్బ సొమ్మంటూ తెరాస ఆవిర్భావ సభలో కాంగ్రెస్, తెదేపాలను కూడా కలిపి తిట్టిపడేసారు. 

వాటన్నిటికీ సమాధానంగా మెదక్ జిల్లా సంగారెడ్డిలో బంగారు తల్లి పథకాన్ని ఆవిష్కరించిన కిరణ్ కుమార్, బయ్యారం గనులను విశాఖ స్టీల్స్ కి ఇవ్వటం జరిగిపోయింది, దాన్ని రద్దు చెయ్యటం కుదరదు.  ఏం చేసుకుంటావో చేసుకోమంటూ కెసిఆర్ కి సవాల్ విసిరారు.  ఆయనకు మద్దతుగా ఉప ముఖ్యమంత్రి  దామోదర రాజ నరసింహ కానీ పిసిసి అధ్యక్షుడు బొత్సా కానీ లేకపోయినా కిరణ్ కుమార్ తీవ్ర స్థాయిలో తానొక్కరే కెసిఆర్ ని ఘాటుగా విమర్శించారు.  ఎవరి బెదిరింపులకూ భయపడేది లేదని కూడా ఆయన హెచ్చరించారు.  ఎవరినైనా ఎదుర్కునే దమ్ము తనకుందని గట్టిగా చెప్పారు

వాటికి మండిపడ్డ కెసిఆర్ మే 2 న మెదక్ జిల్లాలో బంద్ కి ముందు పిలుపునిచ్చినా, ఆ రోజు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలుండటం వలన బంద్ ని మే 3 కి వాయిదా వేసామని ప్రకటించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles