Political general and railway budget passed in parliament

budget proposal passed in parliament, no tax on agricultural property, no service tax on railways, finance minister chidambaram, speaker meira kumar, bjp, dmk

general and railway budget passed in parliament

బహిష్కరణల నేపథ్యంలో హడావిడిగా బడ్జెట్ ప్రతిపాదనలు

Posted: 04/30/2013 03:42 PM IST
Political general and railway budget passed in parliament

కేంద్ర రైల్వే, సాధారణ బడ్జెట్ లు పార్లమెంట్ ఆమోదాన్ని పొందాయి.  వాటిలో ఎటువంటి చర్చలూ జరగలేదు.  కారణం ప్రతిపక్షాలు సభను బహిష్కరించటమే.  

న్యాయశాఖా మంత్రి ప్రధాన మంత్రుల రాజీనామాను కోరుతూ అవినీతికి నిరసనగా భారతీయ జనతా పార్టీ సభను బహిష్కరించింది.  ఎప్పుడూ లేనంత అవినీతిలో కూరుకుపోయిన యుపిఏ ప్రభుత్వానికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేదంటూ సుష్మా స్వరాజ్ ఆరోపించారు.  జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు చాకో రాజీనామాను కోరుతూ డిఎమ్ కే పార్టీ కూడా సభను బహిష్కరించింది.

ఈ నేపథ్యంలో హడావిడిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టి చర్చలు లేకుండానే పార్లమెంట్ లో వాటిని ఆమోదించారు.  ఆర్థిక మంత్రి చిదంబరం బిల్లును ప్రవేశపెడుతూ, వ్యవసాయరంగం మీద ప్రభుత్వం ఎప్పుడూ పన్ను విధించాలని చూడలేదని, అలా అనుకుంటే అది పొరపాటవుతుందని, వ్యవసాయ ఆదాయం మీద సంపదల మీద ఈ బడ్జెట్ లో ఎటువంటి పన్నులూ ప్రతిపాదించలేదని స్పష్టం చేసారు.  రైల్వే మీద సేవా పన్ను కూడా ఎత్తివేయటం జరిగిందని కూడా చిదంబరం వెల్లడించారు.  

సభను బహిష్కరించగా మిగిలిన వామపక్షాలు, బిజెడి, అన్నా డిఎమ్ కే పార్టీలు కూడా చర్చలు లేకుండా అత్యంత ముఖ్యమైన బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదించినందుకు నిరసనగా సభను బహిష్కరించారు.  
అతి కీలకమైన, ప్రాధాన్యతను సంతరించుకున్న బిల్లులను చర్చలు లేకుండా ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఆమోదిస్తున్నందుకు తనకు చాలా బాధాకరంగా ఉన్న విషయమని లోకసభ స్పీకర్ మీరా కుమార్ అన్నారు.

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles