Chaos at siddaramaiah swearing in 1 killed

Siddaramaiah , Governor H R Bhardwaj, Sri Kanteerava Stadium , 50,000 people ,

64-year-old Siddaramaiah is being sworn in alone by the state Governor H R Bhardwaj at a ceremony in Sri Kanteerava Stadium where 50,000 people from his home district Mysore and nearby areas present.

రామయ్య ప్రమాణంలో అపశ్రుతి

Posted: 05/13/2013 06:10 PM IST
Chaos at siddaramaiah swearing in 1 killed

మొన్న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయిన సిద్దరామయ్య ఈ రోజు ఉదయం బెంగుళూరులో కంఠీరవ క్రీడా మైదానంలో గవర్నర్ భరద్వాజ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర రాజధాని బెంగళూరులో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ సంఖ్యలో కాంగ్రెసు నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. మొదట నిర్ణయించిన ముహూర్థం ప్రకారం సిద్ధరామయ్య 28వ ముఖ్యమంత్రిగా పదకొండు గంటల నలభై నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తో పాటు పలువు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

కానీ ఈ ప్రమాణ స్వీకారంలో చిన్న సంఘటన చోటు చేసుకుంది. కార్యక్రమం అంతా అయిపోయిన తరువాత కార్యకర్తలు ఒక్కసారిగా బయటకు వెళ్లే సమయంలో గేట్లు చిన్నగా ఉండటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నంజప్పతో సహా నలుగురు గాయపడ్డారు. నంజప్పను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇతను మృతి చెందాడు. ప్రమాణ స్వీకారం రోజు ఇలా జరిగినందుకు సిద్ధ రామయ్య విచారం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles