Pcc chief son among 24 dead in bastar

Chhattisgarh PCC chief, Nand Kumar Patel, Dinesh, Bastar-Sukma districts, Jagdalpur

PCC chief, son among 24 dead in Bastar, PM slams ‘security failure’ - Over 12 hours after Chhattisgarh PCC chief Nand Kumar Patel had been abducted along with his son Dinesh follow.

పీసీసీ అధ్యక్షుడ్ని చంపేశారు

Posted: 05/27/2013 10:30 AM IST
Pcc chief son among 24 dead in bastar

ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ నాయకుల పై, కార్యకర్తల మావోయిస్టులు పంజా విసిరిన సంఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలతో పాటు సల్వాజుడుం నేత మహేంద్రకర్మతో పాటు పలువురు మరణించిన విషయం వెలిసిందే. అయితే ఈ దాడి సంఘటన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌ఘడ్‌ పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ ఆయన కుమారుడు దినేష్ పటేల్ ని మావోయిస్టులు అపహరించారు. వీరిని కూడా దాడి రోజు రాత్రే హతమార్చారు. పరివర్తన యాత్ర పేరుతో వెళ్తున్న కాంగ్రెస్ కాన్వాయ్‌పై మందుపాతరతో ముందుగా పేల్చి, ఆతర్వాత కాల్పులు జరపడం, ఈ ఘటనలో దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు, మరికొందరు మాజీఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 150మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తూటాల గాయాలతో నిండి ఉన్న తండ్రీ కొడుకుల మృతదేహాలతోపాటు మరో ఎనిమిది మృతదేహాలను బస్తర్ డివిజన్‌లోని జిరామ్ లోయలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం చెప్పారు. మృతదేహాలకు జగ్దల్‌పూర్‌లో పోస్టుమార్టం అనంతరం నివాళులర్పించి ప్రత్యేక విమానంలో రాయ్‌గఢ్ తరలించారు. ఈ పది మందితో కలిపి ఈ సంఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. బాధితులను ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరణించిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles