Governor accepts resignation of dharmana sabita

ministers,parties and movements, political parties,Governor E.S.L. Narasimhan, P. Sabitha Indra Reddy resignation, Congress, YSR Congress party.

Despite the resignations of the two ministers in his pocket and since last Sunday, chief minister Kiran Kumar Reddy prolonged the suspense as to when would he forward them to the governor for acceptance.

వీరిద్దరిని సాగనంపారు

Posted: 05/27/2013 10:34 AM IST
Governor accepts resignation of dharmana sabita

కళంకిత మంత్రులుగా ముద్ర వేసుకుని రాజీనామాలు సమర్పించిన మంత్రులు ధర్మాన ప్రసాదరావు, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ల రాజీనామా ల పై ఉత్కంఠ తొలగిపోయింది. గత వారం రోజుల నుండి సస్పెన్ష్ థ్రిల్లర్‌గా సాగిన రాష్ట్రకేబినేట్‌లోని సీనియర్ మంత్రులు ధర్మాన, సబితల రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. అయితే వీరి రాజీనామాల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నాలు విపలం అయ్యాయి. ప్రతి పక్షాల నుండి ఒత్తిడి ఎదుర్కొంటున్న అధిష్టానం కళంకిత మంత్రుల వ్యవహారం లో కఠినంగా ఉండటంతో వీరి రాజీనామాలను ముఖ్యమంత్రి గవర్నర్ కి పంపిన వెంటనే ఆయన ఆమోద ముద్ర వేయడం విశేషం. ఆయన ఆమోదించిన వెంటనే ఈ ఇద్దరు మంత్రులు తొలగిపోవాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. వాన్‌పిక్ కేసులో ఐదో నిందితుడుగా ధర్మాన ప్రసాదరావు ఉండగా, దాల్మియా సిమెంట్స్ కేసులో నాలుగో నిందితురాలుగా సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. అయితే తాము నిర్దోషులమన్న సంగతి కోర్టులోనే తేల్చుకుంటామని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని ఇద్దరు మంత్రులు చెప్తున్నారు. ఇక వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఈ శాఖలను తానే నిర్వహించబోతున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీంతో వీరు మాజీ మంత్రులుగ మారిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles