Chello assembly high tension at osmania university

High Tension at Osmania University, Tension in Osmania University, ou students, chello assembly, trs leaders, students parties, political parties, bjp, tdp, congress party, police, breaking news, ap politics, political news, andhra news

High Tension at Osmania University

ఉస్మానియా వద్ద హై టెన్షన్ ?

Posted: 06/13/2013 03:47 PM IST
Chello assembly high tension at osmania university

రేపు జరగబోయే ఛలో అసేంబ్లీకి అనుమతి ప్రభుత్వం ఇవ్వనందుకు, తెలంగాణ నాయకులు, విద్యార్థులు, ఒకటై చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యటానికి సిద్దమవుతున్నారు. నిన్నటి నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యుద్ద వాతావరణం నెలకొంది. విద్యార్థుల పై పోలీసులు దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఛలో అసేంబ్లీకి అనుమతి కోరుతూ ఉస్మానియా విద్యార్థులు ర్యాలీగా వస్తుండగా ఎన్ సీసీ గేటువద్ద పోలీసులు వారిని అడ్డుకుని లాఠీఛార్జ్ చేసి భాష్పవాయువు ప్రయోగించారు. దీంతో విద్యార్థులు తిరగబడి రాళ్లదాడికి దిగారు. అక్కడి పరిస్థితిని చిత్రీకరించేందుకు వచ్చిన మీడియా లైవ్ వాహనాల కేబుల్ ను పోలీసులు కత్తిరించారు.పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ రోజు పోలీసుల కళ్లుగప్పి సిటీ బస్ లో అసేంబ్లీ వద్దకు చేరుకున్న ఉస్మానియా విద్యార్థులు అసేంబ్లీ 2 వ గేటు నుండి లోనికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. మరో వైపు తెలంగాణ ప్రాంతంలో అక్రమ నిర్భంధాలను నిలిపివేయాలని కోరుతూ సాయంత్రం టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌ను కలవనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles