35 dead in train accident in bihar

Bihar, Train accident, saharsa, rajrani express, Rajya Rani Express, Bihar Train Accident, Hindu pilgrims, Khagaria, Dhamara Ghat,Shravan, Nitish Kumar, acciden

A speeding train has reportedly run over and killed 35 people at Khagaria in Bihar.

బీహార్ లో రైలు ప్రమాదం : 35 దుర్మరణం

Posted: 08/19/2013 01:52 PM IST
35 dead in train accident in bihar

బీహార్ లో నేటి తెల్లవారు జామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంలో 35 మంది మరణించినట్లు కజారియ ఎంపీ దినేష్ చంద్రయాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. బీహార్ లోని దమారా రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారు జామున ఈ సంఘటన చోటుచేసుకుంది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తూర్పు రైల్వే పరిధిలోని సమస్తిపూర్ డివిజన్లో దమారా రైల్వే లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సహార్సా నుంచి పాట్నా వెళ్లే రాజ్యరాణి ఎక్స్ప్రెస్ ను దమారా స్టేషన్ లో ఆపేందుకు అనేక మంది పట్టాల పైకి వచ్చారు. కానీ రాజ్యరాణి ఎక్స్ ప్రెస్ వేగంగా వచ్చి వారిని ఢీకొట్టడంతో 35 మంది అక్కడిక్కడే మరణించారు. చాలా మంది క్షతగాత్రులు అయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటన పై విచారణ చేపట్టాలని అధికారుల్ని అదేశించారు. అయితే దమారా స్టేషన్ లో రాజ్యరాణి ఎక్స్ ప్రెస్ కి స్టాప్ లేదని చెబుతున్నారు రైల్వే అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles