పదహారేళ్ళ మైనర్ బాలిక పై లైంగిక వేధింపులకు ఒడిగట్టాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ గత నెల 15వ తేదీన అరెస్టు అయి రిమాండ్ లో ఉన్న ఆశారాం బాపు రాసలీలల వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పొటెన్సీ టెస్ట్ లో 72 ఏళ్ళ వయస్సులో కూడా ఆశారాం కి ‘ఆ ’ శక్తి యువకుల మాదిరి ఉందనే భయంకర నిజాలను తెలుసుకున్న డాక్టర్లు విస్తుపోయిన విషయం తెలిసిందే. ఇక పోలీసు విచారణలో ఆశారాం అనుచరుడు శివ ఇంకా విస్తుపోయే నిజాలను బయటపెట్టడంతో పోలీసులు అమ్మా ముసలోడా అని ముక్కున వేలేసుకున్నారు. మధ్యప్రదేశ్ చింద్వారా గురుకుల్ హాస్టల్ వార్డెన్ శిల్పితో ఆశారాం రోజు రాసలీలలు సాగించేవాడని, రాత్రి ఎనిమిది దాటిన తరువాత మహిళలను తన ధ్యానమందిరంలో కలుసుకునే వారని, శిల్పితో రాసలీలలు సాగించినందుకు ఆమెకు అహ్మదాబాద్ లో ఒక ఫ్లాట్, ఢిల్లీలో మరో ఫ్లాట్ బహుమతిగా ఇచ్చాడని, అందుకు బదులుగా ఆమె కొందరు మైనర్ బాలికలని, యువతులని ఆశారాం వద్దకు పంపుతుండేదని శివ పోలీసులకు వివరించాడు.ఆశారాం ఆశ్రమం ఆయుర్వేదిక్ విభాగంలో పనిచేసే అమృత్ ప్రజాపతి సైతం ఆశారాంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యా ప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఆశారాం మూడు ఆశ్రమాలను నెలకొల్పారని, అక్కడ ఉండే మహిళలతో శారీరకసంబంధం కొనసాగించేవాడని ఆరోపించారు. తాను స్వయంగా ఆశారాం 25 ఏళ్ల యువతితో సన్నిహితంగా ఉండటాన్ని చూసినట్లు తెలిపారు. లైంగిక వేధింపుల నేరం కింద పోలీసులు తనపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆశారాం బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించాడు. అయితే కోర్టు అతని బెయిల్ పిటిషన్ని కొట్టివేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more