Shabbir ali counter to chandrababu

shabbir ali counter to chandrababu, congress party, telangana bill, assembly, tdp, chandrababu naidu, shabbir ali, ap bifurcation, rayana telangana, telangana state,

shabbir ali counter to chandrababu

దమ్ముంటే అసెంబ్లీలో నీ ప్రతాపం చూపించు?

Posted: 12/03/2013 09:43 AM IST
Shabbir ali counter to chandrababu

తెలుగేదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి .. కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ  నుండి గట్టి సవాల్ ఎదురైంది.  తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లికి వచ్చిన తర్వాత  దమ్ముంటే  తెలుగుదేశం పార్టీ  తన వైఖరిని  వెల్లడించాలని  షబ్బీర్ అలీ చంద్రబాబు కు సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం  ఏర్పడటం ఖయమని  ఆయన అన్నారు. అయితే తెలంగాణ ను ఎవరు అడ్డుకోలేరని  షబ్బీర్  చెప్పటం జరిగింది.  

అంతేకాకుండా  తెలంగాణ రాష్ట్రం విషయంలో ఎవరెన్ని అడ్డంకులు కలిగించినప్పటికీ, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ అంశంపై అసెంబ్లిలో అభిప్రాయాలు వెల్లడవుతాయని షబ్బీర్‌ పేర్కొన్నారు. మెజారిటీ సభ్యులు వెల్లడించే అభిప్రాయా లనే బిల్లులో రూపొందిస్తారని, ఆశాభావం వ్యక్తం చేశారు. 

తెలంగాణ అంశంలో విమర్శలు గుప్పిస్తున్న నాయకులు అసెంబ్లిలో తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పవచ్చన్నారు. రాజకీయ పార్టీలు తమ సూచనలు చెప్పడానికి అసెంబ్లి కంటే పెద్ద వేదిక లభిస్తుందా అని షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంత మంత్రులు హైదరాబాద్ ను  కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్‌ చేయడాన్ని తప్పుపట్టారు. హైదరాబాద్ ను యూటీ చేయడం ద్వారా ప్రజలకు ఓరిగే లాభం ఏమిటని షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. 

ఆ ప్రతిపాదనలో పసలేదన్నారు. ప్రజాస్వామ్యం వున్న దేశంలో చాలా రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలను రద్దు చేసి అసెంబ్లీని ఏర్పాటు చేసిన సంగతి ఆయన గుర్తుచేశారు. పుదుచ్చేరి, గోవా, సిక్కిం, ఢిల్లీలోనే యూటీ లేదన్నారు. మరి ఏ ప్రాతిపదికన హైదరాబాద్  యూటీ కావాలని కోరుతు న్నారని నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles