Permission for apngos dharna awaited

Permission for APNGOs dharna awaited, APNGOs Association, APNGOs President Ashok Babu, BJP, APNGOs Dharna, APNGOs against T bill

Permission for APNGOs dharna awaited

ఎపిఎన్జీవోల ధర్నాకు ఇంతవరకు అందని అనుమతి

Posted: 01/21/2014 04:54 PM IST
Permission for apngos dharna awaited

బుధవారం నాడు సమైక్యవాదులు చేయబోయే ధర్నాకు పోలీసు శాఖ నుంచి ఇంతవరకు అనుమతి లభించలేదని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు.  ఒకవేళ అనుమతి లభించని పక్షంలో ఏం చెయ్యాలనే కార్యాచరణను తరువాత ఆలోచిస్తామన్నారాయన. 

తాము చేపట్టింది చలో అసెంబ్లీ కాదని, తమ ధర్నా వలన నిరసన తెలియజేయటం జరుగుతుందే తప్ప ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని, ఆ దిశగా పోలీసులకు హామీ కూడా ఇచ్చామని అశోక్ బాబు తెలియజేసారు. 

ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అశోక్ బాబు రేపటి కార్యాచరణ ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని, పోలీసు శాఖనుంచి వచ్చేదీ రానిదీ చూసి దాన్నిబట్టి కార్యాచరణ రచన జరుగుతుందని చెప్పిన అశోక్ బాబు భాజపా తీరుని విమర్శించారు.  తెలంగాణా ఆవిర్భావానికి మద్దతిస్తామని అన్న భాజపా బిల్లుని మాత్రం వ్యతిరేకిస్తుందంటూ ఆయన విమర్శించారు. 

అయితే సాయంత్రం లోపులో రేపటి ధర్నాకు అనుమతి లభిస్తుందనే ఆశాభావాన్ని కూడా అశోక్ బాబు ప్రకటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles