రైలు భవన్ ఎదురుగా దీక్షలో కూర్చున్న కేజ్రీవాల్ రెండవరోజు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోబోతున్నారు. రైల్ భవన్ ఉన్నదే రాజ్ పథ్ పక్కన గణతంత్ర వేడుకలు జరిగేవే అక్కడ. రెండు రోజుల తర్వాత ఆ వేడుకలకు తయారీలు, రిహార్సల్స్ జరగవలసింది అక్కడి నుండే. కాబట్టి అక్కడి నుండి ఆందోళనకారులను ఎలాగైనా చెదరగొట్టాలని చూస్తున్నారు పోలీసులు.
ఢిల్లీలో చట్టవిరుద్ధంగా అకృత్యాలు జరుగుతుంటే కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ముఖం తిప్పుకుని కళ్ళు మూసుకుని ఉంటే మేము ఆందోళన చెయ్యకుండా ఎలా ఉంటాం? అని ప్రశ్నించారు ఆఆపా అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఈ విషయంలో చర్చలకు కూడా తావు లేదని, ఢిల్లీలో మహిళలకు భద్రత లేనప్పుడు అది చర్చలతో సమాధానాపడే సమస్య కాదని, కేవలం కార్యాచరణే జరగవలసిన పనని కేజ్రీవాల్ అన్నారు. మహిళల మీద జరుగుతున్న దాడులను ఉటంకిస్తూ కేజ్రీవాల్ డానిష్ మహిళ మీద తాజాగా జరిగిన దాడి ప్రస్తావన తీస్తూ మహిళల భద్రత కల్పించే విషయంలో పోలీసుల వైఫల్యాన్ని దుయ్యబట్టారు.
ముఖ్యంగా వచ్చిన సమస్యంతా ఢిల్లీ పోలీసులతోనే కాబట్టి ఆఆపా కార్యకర్తలకూ పోలీసులకూ మధ్య తోపులాటలు జరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీ కి ముఖ్యమంత్రిగా ఉండటానికి మద్దతిచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రికి చట్టాన్ని అమలుపరచే యంత్రాంగానికి పగ్గాలను మాత్రం ఆయన చేతిలో పెట్టలేదు.
ఆమ్ ఆద్మీ అంటే సామాన్య ప్రజ. సామాన్య ప్రజానీకం పోలీసుల విషయంలో సురక్షిత భావంలో ఉన్నారా. లేరు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ బాధ్యతను తలకెత్తుకుంటోంది. మాదక ద్రవ్యాలు, వ్యభిచారం జరుగుతున్నదన్న సమాచారం స్థానికుల నుంచి వచ్చినపుడు, పోలీసు శాఖ చేతిలో లేనప్పుడు ప్రభుత్వం ఏం చెయ్యగలుగుతుంది. మంత్రిగారే స్వయంగా పూనుకుని రైడ్ చెయ్యవలసివచ్చింది. దాన్ని కూడా తప్పు పడితే మరి చెయ్యగలిగిందేముంటుంది?
సమాజంలో మొలకెత్తే సమస్యలకు మూలం మాదక ద్రవ్యాల మత్తులో తప్పులకు పాల్పడే యువత మానసిక బలహీనత కాదా? పోలీసు శాఖకు జవాబుదారీ తనం లేనప్పుడే సమస్యలు ఇంకా పెద్దవవుతాయి. పోలీసులు బాధ్యతాయుతంగా జవాబుదారీ తనంతో పనిచేసినట్లయితే ముంబై లో అనూహ్యకు ఆ గతిపట్టేది కాదు కదా! డానిష్ యువతి మీద అత్యాచారంలో పోలీసు బాధ్యతేమిటి? సమాజంలో ప్రజల భద్రత కోసం జీతం తీసుకుంటున్న పోలీసులు ఎప్పుడైనా తమ వైఫల్యానికి సంజాయిషీ ఇచ్చుకున్నారా, పశ్చాత్తాప పడ్డారా, క్షమాపణ కోరారా? లేదు! పైగా తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలే చేస్తారు. పోలీసులు సరే, హోం మంత్రి కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మిన్నకుండటం సరైనదేనా?
కేజ్రీవాల్ ఆందోళనను అడ్డుకోజూసే పోలీసులు ఆ బలగాల్లో కొంత భాగమైనా, కొంత సమయాన్నైనా వెచ్చించి సమాజంలో ఉన్న చీడను వదిలించటానికి ప్రయత్నించారా? ఎప్పుడైనా పోలీసుల తప్పిదాలు బయటపడితే గిడితే వాళ్ళని స్థాన చలనం చెయ్యటం, లేదా బర్తరఫు చేసామని చెప్పటం చేస్తారు అంతే! దాని వలన ఏమవుతుంది? కేవలం ధనికులకు, గొప్ప స్థానాల్లో ఉన్నవారికోసమేనా పోలీసు శాఖ ఉన్నది?
అందుకే విఐపి సంస్కృతికి స్వస్తి చెప్తూ పోలీసు బలగాలు సమాజంలో వాళ్ళు చెయ్యవలసిన సేవలు చెయ్యండి కానీ అనవసరంగా విఐపి లకు భద్రతనివ్వటంలో బలగాలను వృధా చెయ్యకండంటూ తనకు కూడా భద్రతా ఏర్పాట్లు చెయ్యవద్దని కేజ్రీవాల్ అనటంలో అంతర్యం!
ఇక్కడ కేజ్రీవాల్ చేస్తున్న ఆందోళనలో చూడవలసింది పోలీసు బలగం మీద తనకు ఆధిపత్యం లేదనే తపన కాదు, పోలీసు శాఖను ప్రఖ్యాళనం చెయ్యలేకపోతున్నానే, ఆ అవకాశం రావటం లేదే అనే! కేజ్రీవాల్ లాగా పోలీసు చర్యలను ప్రశ్నించే వాళ్ళు మన రాష్ట్రంలో ఒక్కళ్ళున్నా తిరుపతిలో దావూద్ సన్నిహితులకు వివిఐపి పాస్ తో శ్రీవారి దర్శనం భాగ్యం కలిగివుండేది కాదు! తితిదే చైర్మన్ కి అంత ధైర్యం వచ్చి వుండేది కాదు. రాజకీయ నాయకుల ముసుగు వేసుకుని గూండాలు డబ్బులు వసూలు చెయ్యగలిగేవాళ్ళు కాదు.
అటువంటి ధైర్యశాలి కేజ్రీవాల్ రూపంలో దేశమంతటికీ కనువిప్పు కలిగే విధంగా ఆందోళన చేపట్టినపుడు అందుకు దేశవాసులంతా సమర్ధన తెలియజేయవలసివుంది!
ముఖ్యమంత్రి ఆందోళనకు దిగవచ్చా, నగరంలో అలజడి సృష్టించవచ్చా, గణతంత్ర వేడుకలను కూడా నిలిపివేస్తామని అనవచ్చా అంటూ ఆరోపిస్తున్నవాళ్ళు ఒక్కసారి తమ హృదయం మీద చెయి వేసుకుని తమ పార్టీలను, వాటి సిద్ధాంతాలను, వాటి ఆకాంక్షలను కాసేపు మనసులోంచి తీసి పక్కన పెట్టేసి ఏమిటి కేజ్రీవాల్ చేస్తున్నదానిలో తప్పు అని ఆలోచిస్తే వాళ్ళకి సమాజంలో చేతన తీసుకునివచ్చే శక్తి కనపడుతుంది కానీ దురుద్దేశ్యం కనపడదు. ఎవరో ఒకళ్ళు నిలబడటం అవసరం. లేకపోతే చేతన రాదు. ఆ నిలబడే వాళ్ళనే మనం నాయకులంటాం. నాయకత్వాన్ని వహించి ప్రజలను ముందుకు నడిపించే వారున్నప్పుడు, మాకోసమే మీరు పాటు పడుతుంటే మేము మీ వెంటరామా అంటూ ప్రజలంతా అటువంటి నాయకుల వెంట నిలబడతారని చరిత్ర మనకు చెప్తుంది. సామాన్య మానవుడు తనంతట తాను ఏమీ చెయ్యలేడు కానీ చేసేవాళ్ళున్నప్పుడు మాత్రం వెన్నంటి నడుస్తాడు!
పోలీసులు ఉన్నది గొప్పవాళ్ళకోసమే, తిరిగి వాళ్ళ సాయంతో తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికే, అలా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారమే నడుస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజ కోసం పైపైన మాట్లాడటం కాకుండా నిజంగా వారి సంక్షేమాన్ని కాంక్షిస్తూ, వారికోసం నిలబడి వారి కోసమే తన జీవితం అంకితమన్న విధంగా పనిచేసే నిజమైన ప్రజానాయకుడు కేజ్రీవాల్ కి ఉన్న బలం ప్రజలే కాబట్టి ఇన్నాళ్ళకి ఆయన రూపంలో దొరికిన ఆధారాన్ని విడనాడకుండా మద్దతునిచ్చినట్లయితే చీపురు చేత బట్టిన ఆఆపా అన్ని శాఖలలోనూ, సమాజంలోని అన్ని వర్గాలలోనూ శౌచం, చేతన తీసుకొస్తుందనటంలో సందేహం లేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more