Uproar in delhi assembly over jan lokpal bill

Uproar in Delhi Assembly over Jan Lokpal Bill, Arvind Kejriwal tables Jan Lokpal bill, Lt Governor writes speaker against lokpal bill

Uproar in Delhi Assembly over Jan Lokpal Bill

ఢిల్లీ లో లోక్ పాల్ మీద శిగపట్లు

Posted: 02/14/2014 05:01 PM IST
Uproar in delhi assembly over jan lokpal bill

అవినీతి నిరోధక చట్టం కోసం జన్ లోక్ పాల్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పట్టుబడుతుండగా దానికి ఆఆపాకి మద్దతునిస్తున్న కాంగ్రెస్, ప్రతిపక్షమైన భాజపాతో పాటు లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా వ్యతిరేకతను చూపిస్తున్నారు. 

బిల్లుని ప్రవేశపెట్టనీయకపోతే రాజీనామా చేస్తానని బెదిరించిన కేజ్రీవాల్ మాటలకు ఇతర రాజకీయ పార్టీల సంశయానికి లెఫ్టెనెంట్ గవర్నర్ లేక తెరదించింది.  ఆయన స్పీకర్ ఎమ్మెస్ ధిర్ కి రాసిన లేఖలో తానింకా ఆ బిల్లు మీద నిర్ణయానికి రాలేదని, అందువలన దానిని శాసనసభలో ప్రవేశపెట్టవద్దని కోరారు.

ఈ రోజు జన్ లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టటానికి చూస్తుండగా భాజపా కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరాలు తెలియజేస్తూ సభలో గందరగోళాన్ని సృష్టించారు.  అయితే ఆ బిల్లు కోసం ఎంతవరకైనా పోతానన్నారు కేజ్రీవాల్.  కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లోక్ పాల్ కి ఆఆపా ప్రవేశపెట్టజూస్తున్న ఈ జన్ లోక్ పాల్ బిల్లు వ్యతిరేకంగా ఉందేమే పరిశీలించవలసిన అవసరం ఉందని, ఆ బిల్లుకి ముందుగా రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉంటుందని కేంద్ర హోం శాఖ నుంచి న్యాయ శాఖ నుంచి సూచనలందటంతో  లెఫ్టెనెంట్ గవర్నర్ తన వీటో పవర్ ని ఉపయోగించి బిల్లును తాత్సారం చేస్తున్నారు. 

రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు రాజ్యాంగ విరుద్ధమని ఇక భాజపా, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకోసం పనిచేస్తారో లేదో వాళ్ళే తేల్చుకోవాలని ఆఆపా నాయకుడు మనీష్ సిసోడియా శాసన సభలోపలికి వెళ్ళేముందు అన్నారు.

గందరగోళం నడుమ జన్ లోక్ పాల్ బిల్లును కేజ్రీవాల్ శాసన సభ టేబుల్ మీద పెట్టారు.  మరోసారి గందరగోళంలో 30 నిమిషాల పాటు సభ వాయిదా వేసి తిరిగి సమావేశమైన తర్వాత బిల్లు ప్రవేశపెట్టటం జరిగిందని, రేపు దానిమీద సభ్యుల వోటింగ్ జరుగుతుందని అన్నారు. 

అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవటానికి సిద్ధమని, జన్ లోక్ పాల్ బిల్లు లాంటి అతి ముఖ్యమైన, ప్రజోపయోగకరమైన, అవినీతి మీద కొరడా ఝళిపించే బిల్లు మీది అంశాలమీద సభ్యులంతా చర్చలో పాల్గొంటారని ఆశిస్తున్నానని రాష్ట్ర న్యాయశాఖా మంత్రి సోమనాథ్ భారతి ఆశాభావాన్ని వ్యక్తంచేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles