Arvind kejriwal resigns as delhi cm

Kejriwal resigns as Delhi CM, Delhi Chief Minister Arvind Kejriwal, Arvind Kejriwal, Aam Aadmi Party, Jan LokPal Bill, Congress party, an Lokpal Bill in Delhi Assembly.

Arvind Kejriwal resigns as Delhi CM

రాజీనామా చేసిన ముఖ్యమంత్రి

Posted: 02/14/2014 09:42 PM IST
Arvind kejriwal resigns as delhi cm

రాజీనామా చేస్తానని  పదే పదే  మీడియా ముందు చెప్పిన  ముఖ్యమంత్రి మాటలు.. ఈరోజు నిజం అయ్యాయి.  ప్రజలు కోసం  పదిసార్లైన  రాజీనామా చేస్తానని  చెప్పిన  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అనంత పని చేశారు.    

 జన్ లోక్పాల్ బిల్లు కోసం వెయ్యిసార్లైనా సీఎం పదవిని వదిలేస్తా అన్న అరవింద్ కేజ్రీవాల్  రాజీనామా చేశారు.      లెప్టినె గవర్నర్ ను  కలిసి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా  సమర్పించనున్నారు. 

జన్ లోక్ పాల్  బిల్లును ప్రవేశ పెట్టకుండా అసెంబ్లీలో  ప్రతిపక్షాలు  తిరస్కరించిన  నేపథ్యంలో  ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు  సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ  తొలిసారి ఢిల్లీ పీఠాన్ని  కైవసం  చేసుకుంది. సీఎంగా  బాధ్యతలు  చేపట్టిన  అనంతరం 49 రోజుల్లోనే కే్జ్రీవాల్  తన పదవికి రాజీనామా చేశారు. 

శాసన సభలో జన్ లోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టడానికి జరిపిన ఓటింగ్ లో అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు వచ్చాయి. బిల్లు తిరస్కారానికి గురికావడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జన్ లోక్ పాల్ బిల్లును తిరస్కరించడంతో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles