Vijayashanthi joins congress criticizes kcr

Vijayashanthi joins Congress criticizes KCR, BJP, Thalli Telangana, TRS, Vijayashanthi criticizes KCR, TRS merger with Congress, Telangana State formation

Vijayashanthi joins Congress criticizes KCR

కాంగ్రెస్ ఖండువా కప్పుకుని కెసిఆర్ ని దుయ్యబట్టిన విజయశాంతి

Posted: 02/28/2014 08:02 AM IST
Vijayashanthi joins congress criticizes kcr

భాజపా నుంచి, తాను స్థాపించిన తల్లితెలంగాణా, దాని నుంచి తెరాస, తెరాస లోంచి నిన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన విజయశాంతి అంతా తెలంగాణా కోసమేనంటున్నారు. 

గురువారం ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో భేటీ ముగిసిన తర్వాత విజయశాంతి సోనియా గాంధీని కలిసారు, ఆ తర్వాత ఆమె సమక్షంలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నానని విజయశాంతి మీడియాకు తెలియజేసారు.  ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ కూడా రూఢి చేస్తూ,  తెలంగాణా ఉద్యమాన్ని లేవనెత్తుకున్న మొదటి నటి, మెదక్ ఎంపీ విజయశాంతి సోనియా గాంధీ దీవెనలందుకున్నారని అన్నారు. 

నా ఆందోళనంతా తెలంగాణా కోసమే, అది నెరవేరటం కూడా జరిగింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని విజయశాంతి అన్నారు.  అయితే ఆమె తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ని పరోక్షంగా విమర్శించారు.  నాయకులెవరైనా మాటకు కట్టుబడివుండాలని, అందుకే తాను అన్నప్రకారం తెలంగాణా బిల్లు ఆమోదం పొందగానే కాంగ్రెస్ లో చేరుతున్నానని అన్నారు.  తెలంగాణా ఇవ్వగానే తెరాస ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పి ఇంతవరకూ తాత్సారం చేస్తూ వస్తున్న కెసిఆర్ ని ఆవిధంగా ఆమె పరోక్షంగా ఎత్తిపొడిచారు. 

విలీనం చెయ్యకపోతే రాష్ట్రపతి పాలనని, విలీనం చేస్తే రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదు కానీ వాతావరణం అలా తయారైంది.  కానీ కెసిఆర్ ఇంతవరకు ఎటువంటి హామీలూ ఇవ్వలేదు.  పైగా ఆయన హైద్రాబాద్ రావటంతోనే ఆయనకు లభించిన ఘన స్వాగతం అటు కాంగ్రెస్ ని, ఇటు తెరాస ను కూడా ఆలోచింపజేస్తున్నాయన్నది మాత్రం కాంగ్రెస్ నాయకుల మాటల్లో స్పష్టమౌతోంది. 

విజయశాంతిని కాంగ్రెస్ లో కలుపుకోవటం ద్వారా కెసిఆర్ మీద వత్తిడి పెరుగుతుందా అంటే అది కేవలం విజయశాంతి వలన కాకపోవచ్చు కానీ ఇతర నాయకులను కూడా అలాగే నెమ్మది నెమ్మదిగా జూలు దువ్వుతూ కాంగ్రెస్ లో కలిపేసుకుంటే అనే ఆలోచన వచ్చేట్టుగా చెయ్యటం కూడా వ్యూహంలో భాగం కావొచ్చు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles