We will solve the problem says sc to tn govt

We will solve the problem says SC to TN Govt, Rajiv Gandhi Assassins, SC stays release of 7 convicts, Convicts of Rajiv Gandhi murder, Release of convicts of Rajiv Gandhi

We will solve the problem says Supreme Court to Tamil Nadu Government

మావలన కలిగిన సంక్షోభమిది మేమే పరిష్కరిస్తాం- సుప్రీం

Posted: 02/28/2014 08:42 AM IST
We will solve the problem says sc to tn govt

రాజీవ్ గాంధీ హత్యకేసులో ముద్దాయిలను విడుదల చేసే విషయంలో ఆ ఏడుగురినీ విడుదల చెయ్యవద్దంటూ ఆదేశాలిచ్చి తమిళనాడు ప్రభుత్వానికి కళ్ళెం వేసిన సుప్రీం కోర్టు ఆ సమస్య మా వలనే వచ్చింది, దాన్ని మేమే పరిష్కరిస్తాం ఒక వారం ఓపిక పట్టండి అని అన్నారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం. 

క్షమాభిక్ష అర్జీలలో నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం జరిగినట్లయితే ఆ శిక్షను తగ్గించవచ్చని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునిచ్చింది.  రాజీవ్ గాంధీ హత్య కేసులో మరణశిక్ష విధించబడ్డ ఏడుగురు ముద్దాయిలూ క్షమాభిక్షకు కోరుకోగా ఆ విషయంలో పుష్కరం తరబడి జాప్యం జరగటంతో వాళ్ళంతా వాళ్ళ శిక్షను తగ్గించమని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసారు.  సుప్రీం కోర్టు వారి శిక్షలను జీవిత ఖైదులోకి మార్చింది. 

దానితో తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే 23 సంవత్సరాలు జైలు శిక్షననుభవించివుండటం వలన వాళ్ళని జైళ్ళనుంచి విడుదల చెయ్యటానికి ఉపక్రమించింది.  దానిని నిలిపివేయమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుని కోరగా సుప్రీం కోర్టు ముందు ముగ్గురి విడుదలను, ఆ తర్వాత మిగిలిన నలుగురి విడుదలను నిలిపివేయమని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు పంపించారు. 

ఈ విషయంలో మాట్లాడుతూ, మేము మా తీర్పులో మరణ శిక్షను జీవిత ఖైదుకి మారుస్తున్నామని చెప్పామంతే.  ఇది స్పష్టత కోసం చేసిన ప్రకటన మాత్రమే.  అయితే ఇందులో అనుసరించవలసిన విధానాలను పక్కకు పెట్టేస్తారా అని ప్రశ్నించారు ప్రధాన న్యాయమూర్తి.  పద్ధతి ప్రకారం ముద్దాయిలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విడుదల కోసం కోరాలి, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసిన కోర్టు నుంచి ఆదేశాలను తీసుకోవాలి, ఆ తర్వాత దానిమీద విచారించి నిర్ణయం తీసుకోవాలి.  ఇవేమీ తెలియవా మీకు  అని అడిగారాయన. 

క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ లోని సెక్షన్ 435 ప్రకారం శిక్షనుంచి విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకుండదు.  ఈ సంగతి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ తెలుసుకోవాలి.  శిక్షలను తగ్గించి వాళ్ళని విడుదల చేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదు అని ఛీఫ్ జస్టిస్ సదాశివం స్పష్టం చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles