Farm loan waivers not liked by rbi and iba

Farm loan waivers not liked by RBI and IBA, Farm loan waiver prestigious to CMs, Telangana Andhra CMs to waive farm loans at any cost

Farm loan waivers not liked by RBI and IBA

నెత్తిమీద కత్తిగా మారిన ఋణమాఫీలు

Posted: 06/18/2014 10:03 AM IST
Farm loan waivers not liked by rbi and iba

ఆంధ్ర తెలంగాణా ముఖ్యమంత్రులు ఎన్నికల హామీగా రైతుల ఋణమాఫీలను ప్రకటించటంతో ఇరు రాష్ట్రాలకు అది ప్రతిష్టాత్మకంగా మారింది.  దానికి తోడు అది జరగని పని అని ఎన్నికల ముందు అన్న ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడు అధికార పక్షం వాటిని అమలుపరచాలని పట్టుపట్టే స్థితి కనిపిస్తోంది.  ఇలాంటప్పుడు అధికార పార్టీ వెనక్కి తగ్గటానికి సిద్ధంగా లేదు.  మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణాలోనైనా కానీ లేదా లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనైనా కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వెయ్యవలసిందే.  అది తలమీద వ్రేలాడుతున్న కత్తిగా మారటమే అందుకు కారణం.  

కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియన్ బాంక్స్ అసోసియేషన్ కానీ ఇందుకు రాజీగా లేవు.  బ్యాంక్ లో తీసుకున్న ఋణాలు ఆదాయాలు కావు.  వాటిని తిరిగి చెల్లించాలి.  అప్పులు ఎగ్గొట్టే సంస్కృతి భవిష్యత్తులో ఆర్థిక రంగంలో చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది.  సకాలంలో పూర్తిగా కానీ లేదా కొంతకాని చెల్లించినవారు ఈ పథకంలో పూర్తి లబ్ధి పొందకపోవటం వలన నష్టపోయిన వారిగా భావించే అవకాశం ఉంది.  

ఈ విధంగా ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీసే పథకాలు రాజకీయంగా తాత్కాలికంగా లబ్ధి కలిగించినా దీర్ఘకాలంలో అవి ఎంతో నష్టాన్ని కలిగిస్తాయంటున్నారు రిజర్వ్ బ్యాంక్, బ్యాంక్స్ అసోసియేషన్ అధికారులు.  

రైతులకు సహాయాన్ని అందించటానికి బ్యాంక్ లు ఎప్పుడూ ముందుంటాయని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన సమయంలో అదనపు ఋణాలను కూడా ఇచ్చిన సందర్భాలున్నాయని, కానీ ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరే ఋణమాఫీకి రిజర్వ్ బ్యాంక్ అనుమతి లభించటం కష్టమౌతుందని బ్యాంక్ లు అంటున్నాయి.  

మరో విషయమేమిటంటే, ఈ రాష్ట్రాలలో దీన్ని అనుమతించినట్లయితే ఇదో విషసంస్కృతిగా మారి ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే దారిపట్టే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తటపటాయిస్తోంది.  

కానీ ఎన్ని అభ్యంతరాలున్నా సరే ఇచ్చిన మాటకు కట్టుబడివుంటామంటున్నారు ముఖ్యమంత్రులు.  లేదంటే ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకతలు ఆందోళనలకు తెరెత్తటం జరుగుతుందనే భయం వెంటాడటమే అందుకు కారణం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles