140 indians not traceable in iraq

140 Indians not traceable in Iraq, External Affairs locating stranded Indian in Iraq, External Affairs Minister Sushma Swaraj monitoring Iraq situation, Muslim Sunni insurgents attacked Iraq

140 Indians not traceable in Iraq

ఇరాక్ లో ఆచూకీ తెలియని 140 మంది భారతీయులు

Posted: 06/18/2014 11:01 AM IST
140 indians not traceable in iraq

సున్నీ ముస్లింల ఉగ్రవాదానికి రాజకీయ, మతపరమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఇరాక్ లో ని మోసుల్ లో జూన్ 10 న జరిగిన ముస్లిం మతోన్మాదుల దాడి తర్వాత 40 మంది భారతీయుల జాడ తెలియటం లేదు.   వాళ్ళని కాంటాక్ట్ చెయ్యటం వీలు కావటంలేదంటూ విదేశాంగ శాఖ చెప్తోంది.  ఎంత ప్రయత్నం చేసినా వారి జాడ తెలియటం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు.  

అయితే భారతీయుల మీద దాడి జరిగిన సమాచారం కూడా ఏమీ రాలేదని కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్తోంది.  అందులో చాలామంది కట్టడాలలో కూలీలుగా పనిచేస్తున్నందువలన, సంబంధిత కార్యాలయంలో వాళ్ళ పేరు నమోదు చేసుకోకపోవటం, వాళ్ళని కాంట్రాక్టర్లు నియమించటం వలన వాళ్ళని సంప్రదించటం కష్టమౌతోందంటున్నారు.  

అలాగే టిక్రిట్ లో 100 మంది భారతీయులు చిక్కుకుపోయివుండవచ్చంటున్నారు అధికారులు.  ఈ ప్రాంతంలో కూడా సున్నీ ముస్లిం ఉగ్రవాదులు దాడి చేసారు.  ఎర్బిల్ పట్టణంలో కొందరు తలదాచుకుంటున్నారని కూడా సమాచారం.  

టిక్రిట్ నుంచి 46 మంది నర్సులు శుక్రవారంనాడు కేరళ ప్రభుత్వానికి ఎస్ఓఎస్ సమాచారం పంపించారు.  మెరినా జోస్ అనే నర్స్ మాట్లాడుతూ, హాస్పిటల్ లో ఖైదీలుగా ఉన్నామని అన్నారు.  పోలీసులు, మిలిటరి, మిగిలిన అందరూ ఇక్కడి నుండి పారిపోయారు, మేము ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నామని ఆమె సమాచారం అందించారు.  

భారత్ తో కాంటాక్ట్ చెయ్యగలిగిన అతి కొద్దిమంది, వాళ్ళ చుట్టుపక్కలంతా దాడులు జరుగుతున్నాయని కాని వాళ్ళు క్షేమంగా ఉన్నామంటూ సమాచారం ఇచ్చారు.  

బాగ్దాద్ లోని ఇండియన్ మిషన్ అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను అక్కడి నుండి క్షేమంగా పంపించే ప్రయత్నాలు చేస్తోంది.  

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు, బాగ్దాద్ లోని ఇండియన్ ఎంబసీ తో కాంటాక్ట్ లో ఉన్నారని అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలియజేసారు.  

బాగ్దాద్ లోని హెల్ప్ లైన్ నంబర్లు ఇవి-

+964 770 444 4899, +964 770 484 3247

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫోన్ నంబర్లు-

+91 11 2301 2113, +91 11 2301 7905, +91 11 2301 4104; Fax: +91 11 2301 8158

ఇమెయిల్- This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles