Telangana cm kcr liberal welfare activities

Telangana CM KCR liberal welfare activities, KCR announced welfare activities cross sources, Telangana State revenue short of promises

Telangana CM KCR liberal welfare activities in spite of crossing sources

చేతికి ఎముకలేని కెసిఆర్!

Posted: 07/19/2014 08:50 AM IST
Telangana cm kcr liberal welfare activities

కెసిఆర్ ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అందరినీ సంతోషంతో ముంచెత్తాయి.  సంబరాలు చేసుకున్నారు, కెసిఆర్ ని పొగడ్తలతో ముంచెత్తారూ అంటే ఆయన చేసిన హామీలు అలాంటివి.  మంత్రివర్గంతో సహా అందరూ ఆ 43 వరాలను కొనియాడారు.  అందులో విద్యుత్తు విషయం ఏమీ చెప్పలేదని కొందరన్నారనుకోండి.  అయితే అది ప్రభుత్వం చేసే పని కాబట్టి ప్రభుత్వమే చేస్తుంది.  దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ఆయన అనుకునివుండవచ్చు.  

ఒక లక్ష పదివేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న హామీలవి.   ఆగస్ట్ 15 నుంచి 18 లక్షల మంది దళితులకు 3 ఎకరాల చొప్పున 54  లక్షల ఎకరాల భూ పంపిణీ చెయ్యాలంటే భూమి సమీకరణకే 76000 కోట్ల రూపాయలవుతుందని అంచనా.  దానికి ముందు సర్వే చెయ్యటానికే 600 కోట్ల రూపాయల ఖర్చవుతుంది.  ఋణ మాఫీలు, తదితర ప్రకటిత సంక్షేమ పథకాల అమలుకు మరో 30000 కోట్ల రూపాయల ఖర్చవుతుందని లెక్కవస్తోంది.  

తెలంగాణా రాష్ట్రంలో ఎంత మిగులు బడ్జెట్ ఉన్నా, కెసిఆర్ ప్రకటించిన కార్యక్రమాలను చెయ్యటానికి భారీగా ఖర్చువుతుంది కాబట్టి అది సాధ్యమౌతుందా లేదా కొందరు ఆలోచిస్తున్నారు.  రాష్ట్ర ఆదాయం చూస్తే దీనికి తులతూగేట్టుగా లేదు.  వచ్చే 9 నెలల్లో మహా అయితే 40000 కోట్ల రూపాయల వరకు రావొచ్చు.  అందువలన మొత్తం ఒకేసారి కాకుండా దశలవారీగా పథకాలను అమలు చేయవచ్చని భావిస్తున్నారు.  

ఏది ఏమైనా కెసిఆర్ ఇచ్చిన హామీల ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తానని మరోసారి ప్రకటించటంతో కెసిఆర్ మాటల మీద మరోసారి నమ్మకం ఏర్పడింది.  కాకపోతే ప్రభుత్వానికి కత్తిమీద సామే.  మూడు సంవత్సరాల వరకు జాగ్రత్తగా బడ్జెట్ వేసుకుంటే తప్ప వాటన్నిటీ నెరవేర్చటం సాధ్యం కాదు.

మొత్తానికి ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ ఖజనాని బార్లా తెరిచి ఖర్చు చెయ్యటానికి సిద్ధపడటం నిజంగా శ్లాఘనీయమే.  సరే, ఇవి మాటలే కదా చేతల వరకు వచ్చే వరకు చూద్దాం, అంతంత ఖర్చులు చెయ్యటమంటే సాధ్యమైన పనేనా, ఆ సమయంలో ఏదో వంక వెతుక్కుంటారులే అనేవాళ్ళు లేకపోలేదు.  కానీ ఒక మంచి పనికి తలపెట్టినప్పుడు మంచి జరుగుతుందనే ఆశిద్దాం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles